Homeజాతీయ వార్తలుLok Sabha Election Results 2024: మాజీ సీఎంల ఆధిక్యం..

Lok Sabha Election Results 2024: మాజీ సీఎంల ఆధిక్యం..

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రులు ఆధిక్యం కనబరుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌ చైహాన్,ఛత్తీస్‌గడ్‌లో భూపేశ్‌ భగేల్, కర్నాటకలో కుమారస్వామి, బస్వరాజు బొమ్మై లీడ్‌లో ఉన్నారు. ఇక యూపీలో ఇండియా, ఎన్డీఏ కూటులు పోటాపోటీగా లీడ్‌ సాధిస్తున్నాయి. కేరళలో ఇండియా కూటమి ఆధిక్యత కనబరుస్తుంది.

– తమిళనాడు తుత్తూరు నియోజకవర్గంలో తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై ఆధిక్యంలోకి వచ్చారు. పోస్టల్‌ ఓట్లు, ఈవీఎం తొలి రౌండ్‌లో వెనుకబడ్డా.. రెండో రౌండ్‌లో లీడ్‌లోకి వచ్చారు.

– రాజస్థాన్‌లో కేంద్ర మంత్రి గజేంగ్రసింగ్‌ షెకావత్‌ ఆధిక్యత కనబరుస్తున్నారు.

– మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లీడ్‌లో కొనసాగుతున్నారు.

– అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు ఆధిక్యంలో ఉన్నారు.

– మహారాష్ట్ర అమరావతిలో నటి నవనీత్‌కౌర్‌ ఆధిక్యంలో ఉన్నారు.

– ముంబై నార్త్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ లీడ్‌లో కానసాగుతున్నారు.

– హైదరాబాద్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చింది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ వెనుకపడ్డారు. మాధవీల మొదటి రౌండ్‌లో ఆధిక్యంలోకి వచ్చారు.

– రాజస్థాన్‌లోని కోట లోక్‌సభ స్థానంలో స్పీకర్‌ ఓం బిర్లా ఆధిక్యంలో ఉన్నారు.

– కశ్మీర్‌లోలోని బారాముల్లాలో ఒమర్‌ అబ్దుల్లా లీడ్‌లోకి వచ్చారు.

– మధరలో నటి, సిట్టింగ్‌ ఎంపీ హేమా మాలిని ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

వెనుకబడి ముందుకు వచ్చిన మోదీ..
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పోస్టల్‌ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన మోదీ.. మొదటి రౌండ్‌లో 1600 ఓట్లతో వెనుకబడ్డారు. రెండో రౌండ్‌లో 619 ఓట్ల లీడ్‌లోకి వచ్చారు.

– వాయనాడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌గాంధీ భారీ అధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌ తర్వాత 52 వేల లీడ్‌లో కొనసాగుతున్నారు.

– అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకబడ్డారు. ఇక్కడ కాంగ్రెస్‌ 9 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular