https://oktelugu.com/

కర్నూలు జిల్లాలో కర్ఫ్యూ?

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వారం రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. జిల్లాలో ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడంతో ప్రస్తుతం 436 కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించగా, 66 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 360 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన వైరస్ క్రమేణా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. జిల్లాలో పాజిటివ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 2, 2020 / 03:38 PM IST
    Follow us on


    రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వారం రోజులుగా గణనీయంగా పెరుగుతున్నాయి. అత్యధిక కేసులు ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. జిల్లాలో ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అవడంతో ప్రస్తుతం 436 కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించగా, 66 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 360 మంది కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన వైరస్ క్రమేణా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. జిల్లాలో పాజిటివ్ కేసుల కట్టడికి జిలా కలెక్టర్ వీరపాండ్యన్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అదుపులోకి రావడం లేదు. లాక్ డౌన్ కర్నూలులో సత్పలితాన్ని ఇవ్వలేదు. దీనికి కారణం లాక్ డౌన్ సక్రమంగా అమలు అవకపోవడమేనని తెలుస్తోంది.

    ఒక్కరి నుండి 100 మందికి సోకిన కరోనా వైరస్

    ఈ పరిస్థితుల్లో జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు తీడుకోవాల్సిన చర్యలు ఎంటనేది ఇప్పుడు అందరి తలలను తొలిచేస్తోంది. లాక్ డౌన్ ఫలించక పోవడంతో కర్ఫ్యూ తప్ప మరో మార్గం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో కర్ఫ్యూ ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎక్కడెక్కడ అమలు చేయాలనే అంశంపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో కర్నూలు నగరంలో అత్యధికంగా 200 కేసులు, నద్యాల పట్టణంలో 88 పాజిటివ్ కేసులు, పట్టణాలు, సమీప గ్రామాల్లో మిగిలిన కేసులు నమోదయ్యాయి.

    లాక్ డౌన్ 3.0లో మందుబాబులకు శుభవార్త!

    రెండు రోజుల కిందట జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కర్నూలు నగరంలోని రెడ్ జోన్లో పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ సక్రమంగా చేయలేకపోవడంపై అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదని అధికారులకు తేల్చిచెప్పారు. జిల్లాలో కరోనాను కట్టడి చేయాలంటే కర్ఫ్యూ మినహా మరో మార్గం లేదనే భావిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నరసరావుపేటలో నాలుగు రోజులుగా పూర్తి స్థాయి లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు అనుమతించడం లేదు. ఎక్కడ సుమారు 100 కేసులు వరకు నమోదయ్యాయి.