European Tourists: బాబ్బాబూ.. మా దేశాలకు మీరు రావద్దు..

ఐరోపా అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భూతల స్వర్గం లాంటి నగరాలు.. బృందావనం లాంటి ప్రాంతాలు.. వీటిని సందర్శించేందుకు ఏటా కోట్లల్లో పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు.. ఉదాహరణకు ఐరోపా ఖండంలోని నెదర్లాండ్ అనే ఒక దేశం ఉంటుంది.

Written By: Bhaskar, Updated On : August 29, 2023 5:22 pm

European Tourists

Follow us on

European Tourists: ఏ దేశాలైనా పర్యాటకంగా ఆదాయం వస్తోంది అనుకుంటే రెడ్ కార్పెట్ పరుస్తాయి. పర్యాటకులకు అపరిమితమైన అనుభూతులను అందిస్తాయి. వారు హాయిగా ఆస్వాదించేలా, తమ దేశాల గురించి బయట గొప్పగా చెప్పుకునేలాగా ఏర్పాట్లు చేస్తాయి. కానీ ఈ దేశాలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మీరు మా దేశాలకు రావద్దు అంటూ పర్యాటకులకు షరతులు విధిస్తున్నాయి. షరతులు మీరితే జరిమానా వసూలు చేస్తున్నాయి. ఆర్థిక మాంద్యం వల్ల రాబడి తగ్గిపోయి దేశాలన్నీ కుదేలవుతున్న నేపథ్యంలో.. ఈ దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

స్థానికులు పరాయివాళ్ళుగా మారిపోయారు

ఐరోపా అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భూతల స్వర్గం లాంటి నగరాలు.. బృందావనం లాంటి ప్రాంతాలు.. వీటిని సందర్శించేందుకు ఏటా కోట్లల్లో పర్యాటకులు ఆ ప్రాంతాలకు వెళ్తుంటారు.. ఉదాహరణకు ఐరోపా ఖండంలోని నెదర్లాండ్ అనే ఒక దేశం ఉంటుంది. దీని రాజధాని అమ్ స్టర్ డామ్. ఇక్కడ జనాభా కేవలం 8.5 లక్షలు. కానీ ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఏటా 2.5 2 కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇదే ఐరోపా ఖండంలోని స్పెయిన్ దేశంలోని బార్సిలోనా జనాభా 16 లక్షలు. కానీ ఏటా సందర్శించే పర్యాటకుల సంఖ్య మూడు కోట్లు. ఇక ఇటలీ లోని ఫ్లోరెన్స్ ప్రాంత జనాభా 3.8 లక్షలు. ఈ ప్రాంతాన్ని ఈట రెండు కోట్ల మంది సందర్శిస్తుంటారు. అంటే దీనిని బట్టి ఐరోపా ఖండాన్ని పర్యాటకులు ఏ స్థాయిలో ఇష్టపడతారో ఇట్టే చెప్పొచ్చు. అయితే ఈ పర్యాటకమే ఇప్పుడు ఆ దేశాల పాలిట శాపంగా మారింది. కోవిడ్ తర్వాత తమ దేశాలను సందర్శించే పర్యాటకులు పెరిగిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. సొంత దేశంలో పరాయి వాళ్ళముగా మారిపోతున్నామన్న భావన వారిలో పెరిగిపోతుంది. హోటళ్ళు, ఇళ్ళు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు పర్యాటకులతో కిక్కిరిసిపోవడంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోందని స్థానికులు అంటున్నారు. ట్రాఫిక్ పెరగడం వల్ల కాలుష్య స్థాయిలు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, ఉమ్మి వేతలు పెరిగిపోతున్నాయి. భద్రత పూర్తిగా తగ్గిపోయింది. పర్యాటకంగా ఆదాయం పెరిగినప్పటికీ జీవనం దుర్భరం కావడంతో స్థానికులు చాలా ఇబ్బంది. విచ్చలవిడి శృంగారాన్ని అనుమతించే ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు.

మా ఊరికి రాకండి

ఈ పరిస్థితులను భరించి భరించి స్థానికులకు సహనం నశించిపోయింది. ఒకప్పుడు పర్యాటకులకు స్వాగతం అన్న వారే.. ఇప్పుడు మా ఊరికి రాకండి అని అంటున్నారు. నగరాలు, పట్టణాలు, కౌన్సిళ్ళ పై పర్యాటకాన్ని ఆపాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారు. అయితే పర్యాటకంగా ఆదాయం బాగా వస్తుండడంతో.. దానికి అడ్డుకట్ట వేయడం వరకు ఇబ్బందికరంగా పరిణమించింది. నిషేధం విధించే బదులు అపరాధ రుసుం వసూలు చేయడం ప్రారంభించారు. గ్రీస్ దేశంలో పురాతన ఆక్రో పోలిస్ చూసేందుకు వచ్చే వారి కోసం టైం స్లాట్ లు కేటాయించడం ప్రారంభించారు. రోజుకు 20,000 మందికి మించి అనుమతించడం లేదు. పర్యాటకులతో వస్తున్న భారీ ఓడలను ఇటలీ, నెదర్లాండ్ దేశాలు నిషేధించాయి. కొన్ని బీచ్ లలో, పట్టణాల్లో ఉండే కాలవ్యవధిని నిర్ధారిస్తున్నారు. అంతకంటే ఎక్కువ సమయం గడిబితే జరిమానా విధిస్తున్నారు. ఇటలీ లోని పోర్టీ ఫినో ప్రాంతంలో సెల్ఫీలు దిగుతూ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని గుర్తించిన ఆ దేశ ప్రభుత్వం.. నో వేయిటింగ్ జోన్ బోర్డు ఏర్పాటు చేసింది. అక్కడ ఎక్కువ సేపు నిలబడి సెల్ఫీలు దిగితే 27 యూరోలుమ దాకా అపరాధ రుసుం విధిస్తున్నారు. వెనిస్ లోని ఏరాక్లియా బీచ్ లో ఇసుక గూళ్ళు కడితే 250 యూరోల జరిమానా విధిస్తున్నారు. పర్యాటకులను నియంత్రించేందుకు ప్రాంతాలవారీగా షెడ్యూళ్ళు అమలు చేయనున్నారు.