Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam- BRS: తెలంగాణ సమాజంపైకి ‘లిక్కర్ స్కాం’.. బీఆర్ఎస్ నేతల బిగ్ ప్లాన్!?

Delhi Liquor Scam- BRS: తెలంగాణ సమాజంపైకి ‘లిక్కర్ స్కాం’.. బీఆర్ఎస్ నేతల బిగ్ ప్లాన్!?

Delhi Liquor Scam- BRS
Delhi Liquor Scam- BRS

Delhi Liquor Scam- BRS: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో పీకల్లోతు వరకు కూరుకుపోయారు కల్వకుంట్ల వారసురాలు, బతుకమ్మ బ్రాండ్‌ అబాసిడర్‌గా చెప్పుకునే కల్వకుంట్ల కవిత. గతంలో సీబీఐ ఆమెను ఈ స్కాంలో సాక్షిగా విచారణ చేసింది. ఎవిడెన్స్‌ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. తాజాగా ఈడీ రగంలోకి దిగింది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దీంతో ఇక అరెస్టే తరువాయి అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఓ మహిళా నేత లిక్కర్‌ స్కాం కేసులో ఇరుకోవడంపై తెలంగాణ మహిళా సమాజం కవితపై దుమ్మెత్తి పోస్తోంది. మరోవైపు కవిత ఢిల్లీ ప్రయాణం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.

తండ్రికి ఫోన్‌ చేసిన కవిత..
ఈడీ నోటీసులు అందిన వెంటనే కవిత తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కవితకు ఫోన్‌చేశారు. నోటీసుల్లో ఉన్న అంశాన్ని వివరించడంతోపాటు, తాను ఢిల్లీకి వెళ్తే జరిగే పరిణామాలపై చర్చించారు. ‘బిడ్డా ధైర్యంగా వెళ్తు.. అంతా నేను చూసుకుంటా’ అని కేసీఆర్‌ కవితకు భరోసా ఇచ్చినట్లు మీడియా ద్వారా ప్రచారం కూడా చేశారు.

వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకునేందుకు..
ఏ రకంగా చూసినా కవితకు పాజిటివ్‌ సంకేతాలు కనిపించడం లేదు. మరోవైపు నెటిజన్లు.. గతంలో ఉన్న ఆరోపణలను జోడిస్తూ కవితను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో గులాబీ బాస్, బీఆర్‌ఎస్‌ నేతలు రగంలోకి దిగారు. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సమస్యలను తెలంగాణ సమస్యగా మార్చడంలో దిట్ట అయిన కేసీఆర్‌.. ఇప్పుడు తన కూతురు సమస్యను తెలంగాణ ఆడబిడ్డల సమస్యగా, తన కూతురుకు జరిగే అవమానం.. తెలంగాణ మహిళా సమాజానికి జరుగుతున్న అవమానంగా చిత్రీకరించేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు.

Delhi Liquor Scam- BRS
Delhi Liquor Scam- BRS

రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు స్కెచ్‌..
కవిత అరెస్ట్‌ అయితే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేసేలా బీఆర్‌ఎస్‌ పెద్ద స్కెచ్‌ వేసినట్లు తెలిసింది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగ ఆల్లరు సృష్టించాలని, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లా కార్యాలయాలపైనా దాడి కూడా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఆందోళనలో మహిళలనే ముందు ఉంచాలని ప్రాన్‌ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ‘తెలంగాణ సమాజం తల వంచదు’ అని కవితతో ఓ స్లోగన్‌ కూడా ఇప్పించినట్లు భావిస్తున్నారు. గతంలో కూడా కవిత ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి’ అని ప్రకటించారు. ఉద్రేకపూరిత స్లోగన్స్‌తో ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్‌ఎస్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై ప్రేమ రాజకీయాల కతీతం || Hats off to Pawan Kalyan || Ok Telugu

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version