
India vs Australia 4th Test: పరువు కోసం ఆస్ట్రేలియా.. సొంతగడ్డపై పరపతి కోసం ఇండియా.. రెండు దిగ్గజ టాప్ 2 జట్లు ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం పోరాడుతున్నాయి. గెలిస్తే ఫైనల్స్ కు వెళ్లే ఆత్రుతలో టీమిండియా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తుదిదశకు వచ్చిన వేళ ఈ టెస్ట్ లో ఎవరిది గెలుపు అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ సంకుల సమరాన్ని ప్రత్యక్ష చూడడానికి 75 ఏళ్ల ఇండియా ఆస్ట్రేలియా ఫ్రెండ్ షిప్ ను ఇనుమడింప చేయడానికి ఇరు దేశాల ప్రధానులు ఈ టెస్ట్ కోసం అహ్మదాబాద్ రావడం విశేషం. మరి ఈ ఉత్కంఠ రేపే టెస్ట్ లో గెలుపు ఎవరిది? ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు భారత్ వెళుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 ఆఖరి దశకు చేరుకుంది. ఈ సిరీస్ ను మరోసారి సొంతం చేసుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించుకున్న సరిపోతుంది. అయితే అంతకంటే పెద్ద లక్ష్యాన్ని భారత్ తన ముందు ఉంచుకుంది. ఈ మ్యాచ్లో నెగ్గడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలనే లక్ష్యంతో భారత్ ఈ చివరి టెస్టులో బరిలోకి దిగుతోంది. దీనికి ముందు టెస్ట్ లో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో చివరి టెస్ట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టెస్ట్ గెలవడమే భారత్ బరిలోకి దిగుతోంది. ఇందుకోసం భారత టీం సర్వశక్తులు వడ్డేందుకు సిద్ధమవుతోంది. చివరి టెస్ట్ లో ఒక మార్పుతో భారత్ టీం ఆడబోతుంది. ఆస్ట్రేలియా టీం మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. 75 ఏళ్ల ఇండో ఆస్ట్రేలియా బంధానికి గుర్తుగా ఈ మ్యాచ్ తొలి రోజు ఆటకు భారత, ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోని ఆల్బనీస్ హాజరయ్యారు
భారత్ – ఆస్ట్రేలియా బంధానికి 75 ఏళ్లు..
ఈ ఏడాదితో భారత ఆస్ట్రేలియా బంధానికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని అంతోనీ అల్బానీస్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాన మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని అంతోనీ అల్బానీస్ హాజరయ్యారు. దాసుకు ముందు ఇరుదేశాల కెప్టెన్లకు క్యాప్ లను ఇరు ప్రధానులు అందించారు. అనంతరం ఇరు ప్రధానులు ల్యాప్ ఆఫ్ ఆనర్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వీరిద్దరూ గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఇరుదేశాల కెప్టెన్లు తమ ప్లేయర్లను ప్రధానులకు పరిచయం చేశారు.

పిచ్ పై చర్చ..
గత మూడు రోజులుగా నాలుగో టెస్ట్ పిచ్ ఎలా ఉంటుందని చర్చ అభిమానుల్లో తెగ నడిచింది. బౌన్సీ వికెట్ ఉంటుందని కొందరు, స్పిన్ ట్రాక్ ఉంటుందని కొందరు వాదించారు. ఇచ్చిన చూస్తే బ్యాటింగ్ వికెట్ లా కనిపించింది. పింకు అనుకూలించేలా ఉన్నా గత మూడు టెస్టులకు తయారుచేసిన పిచ్ లా తొలి రోజు నుంచే స్పిన్ అయ్యే అవకాశం అయితే లేదు. దీంతో ఇల్లు చెట్లు కూడా ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగేందుకు మొగ్గు చూపాయి.
ఒక్క మార్పుతో బరిలోకి భారత్..
బోర్డర్- గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఆఖరి టెస్ట్ గురువారం ప్రారంభమైంది. ఈ సిరీస్లో ఇప్పటికే భారత్ ముందంజలో ఉంది. మొదటి రెండు టెస్టుల్లో భారత్ ఘన విజయం సాధించింది. మూడో టెస్ట్ లో ఆసీస్ విజయం సాధించింది. అయితే, ఈ టెస్టులో విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలనే లక్ష్యంతో భారత్ చివర టెస్ట్ కు సిద్ధమైంది. అందులో భాగంగా తుది జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగింది. గత టెస్టులో ఆడిన సిరాజ్ స్థానంలో మళ్లీ మహమ్మద్ షమీని భారత్ తుది జట్టులోకి తీసుకుంది.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
మొదటి రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట కొట్టుకున్న ఆస్ట్రేలియా మూడో టెస్ట్లో పుంజుకొని భారత్ ను ఓడించింది. ఇక ఆఖరి టెస్ట్ లోని గెలిచి సిరీస్ ను సమం చేయాలన్న లక్ష్యంతో ఆసీస్ బరిలోకి దిగింది. చివరి టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెనర్లు హెడ్, ఉస్మాన్ కవాజా బ్యాటింగ్ చేస్తున్నారు. 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా 24 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.