AP Liquor: మరి కొద్దీ గంటల్లో ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకో బోతున్నారు. 2021 ఏడాదికి గుడ్ బై చెప్పి 2022 ను ఘనంగా ఆహ్వానించాలని సిద్ధం అవుతున్నారు. కుల, మతం, ప్రాంతం అనే బేధం లేకుండా అందరు న్యూ ఇయర్ వేడుకలను తమకు నచ్చిన విధంగా జరుపు కుంటారు. కొత్త ఏడాది లోకి అడుగు పెట్టగానే అందరు ఒకరికి ఒకరు విషెష్ చెప్పుకుని తమ ఆనందాన్ని పంచుకుంటారు.
అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా న్యూ ఇయర్ వేడుకలకు దూరం ఉన్న ప్రజలు ఈ ఏడాది అయినా అట్టహాసంగా జరుపుకోవాలని భావించారు. కానీ కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ వచ్చి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తుంది. అందుకే మన దేశంలో చాలా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపు కునేందుకు అనుమతులు ఇవ్వలేదు.
Also Read: చంద్రబాబును ‘కన్నీళ్లు’ పెట్టించింది
అయితే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే అనుమతి ఇచ్చింది కానీ కఠిన ఆంక్షలు పెట్టి వేడుకలు జరుపు కోవాలని సూచించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో వైన్ షాపులు మూసివేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది.
డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లకు అనుమతి ఇస్తున్నట్టు ఎక్ససైజ్ శాఖ ప్రకటించింది. వైన్ షాపులు 10 గంటల వరకే తెరిచి ఉంటాయని అయితే అంతకు ముందు క్యూ లో నిలబడిన వారికీ మద్యం అందిస్తామని తెలిపింది. ఏపీలో కూడా ఓమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న కారణంగా న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విదిస్తుంది. నగరాల్లో, పట్టణాల్లో ఇంకా ఆంక్షలను కట్టుదిట్టం చేసింది.
ముఖ్యంగా విశాఖ పట్నం, తిరుపతి, విజయవాడ, అనంతపురం వంటి నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు మార్గదర్శకాలు జారీ చేసారు. క్లబ్బులు, రెస్టారెంట్ లలో న్యూ ఇయర్ వేసుకలు నిర్వహించేందుకు ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని.. నిర్వాహకులు సామజిక దూరం మరియు కోవిద్ నిబంధనలు పాటిస్తూ.. సీటింగ్ కెపాసిటీ 60 శాతం మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఇంకా డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని విజయ వడ సీపీ కాంతి రానా టాటా స్పష్టం చేసారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు అంతకన్నా ఎక్కువ గుమి గుడి కనిపిస్తే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 సి ఆర్ ఫై సి కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే డీజే, సౌండ్ సిస్టం వినియోగించ కూడదని, మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపకూడదని అలా చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: అమరావతి పేరు మీద అప్పు కోసం జగన్ ప్రయత్నాలు?