https://oktelugu.com/

Venu Udugula: నాలుగేళ్లు కష్టపడితే టాలెంటెడ్ డైరెక్టర్ కి బ్యాడ్ ఫీడ్ బ్యాక్

Venu Udugula: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’కు కాలం కలిసి రావట్లేదు. నిజంగానే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతం. ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ కొట్టాడు. హిట్ వచ్చింది అంటే.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి. రెండో సినిమా పూర్తి చేయడానికి అడిగినంత డబ్బు ఇస్తారు. అయితే, వేణుకు మాత్రం అవేమీ జరగలేదు. పైగా గత రెండు సంవత్సరాల […]

Written By:
  • Shiva
  • , Updated On : December 31, 2021 / 03:08 PM IST
    Follow us on

    Venu Udugula: యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ‘వేణు ఉడుగుల’కు కాలం కలిసి రావట్లేదు. నిజంగానే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతం. ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త ఎలిమెంట్స్ ను జోడించి మంచి హిట్ కొట్టాడు. హిట్ వచ్చింది అంటే.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చి పడతాయి. రెండో సినిమా పూర్తి చేయడానికి అడిగినంత డబ్బు ఇస్తారు. అయితే, వేణుకు మాత్రం అవేమీ జరగలేదు.

    Venu Udugula

    పైగా గత రెండు సంవత్సరాల నుండి ఒకే సినిమా పై తెగ కష్ట పడుతున్నాడు, అయినా ఆ సినిమా మాత్రం పూర్తి అవ్వట్లేదు. రానా, సాయిప‌ల్ల‌విలను హీరోహరోయిన్లుగా పెట్టి ‘విరాటపర్వం’ అనే పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ ను దాదాపు నాలుగు సంవత్సరాల నుండి చేస్తున్నాడు వేణు. అసలు రానాతో ఒక చిన్న సినిమా కోసం నాలుగేళ్లు ఖర్చు పెట్టడం అంటే కచ్చితంగా కష్టమైన పనే.

    Also Read:   ‘వంగవీటి’ ఈసారైనా సరైన నిర్ణయం తీసుకుంటారా?

    అయినా, వేణు మాత్రం ఇంకా ఆ సినిమా పట్టుకునే వెళ్ళాడుతున్నాడు. అసలు ఈ సినిమాకి అంత టైం పట్టడానికి ప్రధాన కారణం.. ఈ సినిమా కథే. కథలోని పాత్రలు ఎక్కువగా ఉండటం.. పైగా అన్ని పాత్రలు కీలకమైనవి కావడం.. దాంతో అన్ని పాత్రలకు ఫామ్ లో ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని.. వారి డేట్లు సెట్ చేసుకుని సినిమా పూర్తి చేయడానికే చాలా టైం పట్టింది. మధ్యలో కరోనా వచ్చింది.

    ఆ తర్వాత షూట్ చేద్దామనుకుంటే.. రానా పెళ్లి… పెళ్లి మూడ్ లో రానా ఇప్పట్లో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేనని ఆరు నెలలు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ వచ్చింది. విరాటపర్వం షూటింగ్ మళ్ళీ పోస్ట్ ఫోన్ అయింది. దాంతో వేణు ఉడుగుల ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. ఇప్పటికే నాలుగేళ్లు ఈ సినిమా కోసం పెట్టాడు. ఇప్పుడు మరో ఆరు నెలలు పెట్టాలి.

    ఇన్నేళ్లు పెట్టినా వచ్చేది మాత్రం అరకొర రెమ్యునరేషన్ అని టాక్. పాపం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ బాధ వర్ణనాతీతమే. వేణు ఉడుగుల మరో సినిమా కోసం కూడా ఇప్పుడు చాలా కష్టపడాలి. విరాటపర్వం డైరెక్టర్ గా తన కెరీర్ కి పెద్ద దెబ్బే. మరోపక్క సినిమాకి కూడా బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

    Also Read: ‘పుష్ప’లో ఈ సీన్ పడి ఉంటేనా..?

    Tags