https://oktelugu.com/

రాజమౌళి- మహేష్ సినిమా పై స్పష్టత !

నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కరోనా అడ్డంకితో ప్రస్తుతం తన ‘ఆర్ఆర్ఆర్‘ షూటింగ్ పనులను వాయిదా వేసుకున్నారు. కానీ రాజమౌళి తర్వాతి చిత్రం ఏమిటని ఇప్పటి నుండే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా రూమార్లు మొదలయ్యాయి. ఆ సినిమాలో హీరో రామ్ అని, లేదూ రానా అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎప్పటిలాగే రాజమౌళి తరువాత సినిమా మహేష్ బాబుతోనే అని, కాకపోతే అది కూడా మల్టీస్టారరే అని.. మహేష్ […]

Written By:
  • admin
  • , Updated On : July 27, 2020 / 03:12 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కరోనా అడ్డంకితో ప్రస్తుతం తన ‘ఆర్ఆర్ఆర్‘ షూటింగ్ పనులను వాయిదా వేసుకున్నారు. కానీ రాజమౌళి తర్వాతి చిత్రం ఏమిటని ఇప్పటి నుండే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా రూమార్లు మొదలయ్యాయి. ఆ సినిమాలో హీరో రామ్ అని, లేదూ రానా అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎప్పటిలాగే రాజమౌళి తరువాత సినిమా మహేష్ బాబుతోనే అని, కాకపోతే అది కూడా మల్టీస్టారరే అని.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ స్టార్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

    Also Read: 10 ఏళ్లు.. 11 మిలియన్ల ఫాలోవర్లు

    రాజమౌళి – మహేష్ సినిమాకి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంకా కథనే పూర్తిగా రెడీ చేయలేదట. ఎలాగూ ఆర్ఆర్ఆర్ పోస్ట్ ఫోన్ అయింది కాబట్టి, మహేష్ సినిమా కోసం ఇప్పుడే తొందరపడట్లేదట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ కోసం.. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రీ లుక్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

    రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాని రూపొందిస్తుండటంతో.. అవుట్ ఫుట్ పట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటు మహేష్ బాబు, పరుశురామ్ సినిమా తరువాత రాజమౌళి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట.