spot_img
Homeజాతీయ వార్తలుKolkata Doctor case: కోల్ కతా అర్జీ కార్ ఆస్పత్రి ఘటనలో నిందితుడికి యావజ్జీవం సబబేనా?...

Kolkata Doctor case: కోల్ కతా అర్జీ కార్ ఆస్పత్రి ఘటనలో నిందితుడికి యావజ్జీవం సబబేనా? కోర్టు తీర్పుపై మమత, ట్రైనీ వైద్యురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారంటే?

Kolkata Doctor case:  ఈ ఘటనకు సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్ కారణమని పోలీసులు గుర్తించారు.. ఆ తర్వాత ఆస్పత్రిలో కొంతమంది దుండగులు ప్రవేశించి ఆధారాలను నాశనం చేసే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి వైద్యులు ధర్నా చేస్తున్న చోటు వద్దకు వెళ్లి బీభత్సం సృష్టించారు. ఆ తర్వాత ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మధ్యలో రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో రచ్చ రచ్చ అయింది. మొదట్లో డాక్టర్లతో చర్చలు జరుపుతామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. మొదటిసారి చర్చలు విఫలమయ్యాయి. రెండవసారి కూడా విఫలమయ్యాయి. మూడోసారి ఫలప్రదమయ్యాయి. అయినప్పటికీ డాక్టర్ల డిమాండ్లను నేటికీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ఇక ఈ కేసు రకరకాల మలుపులు తిరిగింది.. ఆస్పత్రి ప్రిన్సిపాల్, సమీప పోలీస్ స్టేషన్ అధికారి పై పోలీసులు అనుబంధ చార్జ్ షీట్ నమోదు చేయలేదు. ఆ తర్వాత వారికి బెయిల్ లభించింది. అయితే ఈ ఘటన జరిగిన 162 రోజుల తర్వాత సిల్దా కోర్టు తీర్పును వెలువరించింది.. భారత న్యాయ సంహిత లోని సెక్షన్ ఆధారంగా సంజయ్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 50వేల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది.. అయితే సిల్దా కోర్టు వెలువరించిన తీర్పుపై సంజయ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.. కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం అతడిని 500 మంది పోలీసుల బందోబస్తు మధ్య సిల్దా కోర్టుకు తరలించారు. శిక్ష విధించే కంటే ముందు అతడికి తన వాదనను వినిపించుకునేందుకు జడ్జి అవకాశం ఇచ్చారు.

సంజయ్ ఏమంటున్నాడంటే..

” నేను ఏ నేరం చేయలేదు.. ఎటువంటి కారణం లేకుండానే ఇందులో ఇరికించారు. నాతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నేను అమాయకుడిని. ఈ కేసులో అనేక ఆధారాలు ధ్వంసమయ్యాయి.. ఇలాంటి క్రమంలో నన్ను ఎలా దోషిగా నిర్ధారిస్తారు? శిక్ష ఎలా విధిస్తారని” అతడు ప్రశ్నించాడు.. ఈ కేసును విచారించిన సిబిఐ న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించాడు..” ఇది చాలా అరుదైన కేసు. ఈ ఘటన వల్ల సమాజం తీవ్రంగా ప్రభావితమైంది. సంజయ్ కి కచ్చితంగా ఉరిశిక్ష విధించాలి. వైద్యులకు రక్షణ లేనప్పుడు.. ఇంకా ఏం చేస్తే బాగుపడుతుంది ఈ సమాజం?” అని ఆయన తన వాదనలు వినిపించారు. మరోవైపు కోర్టు 17 లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు ఇవ్వడంతో.. దానిని బాధిత డాక్టర్ తల్లిదండ్రులు తిరస్కరించారు. ” మాకు ఎలాంటి పరిహారం వద్దు. న్యాయం మాత్రమే కావాలి.. అతడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నామని” వారు పేర్కొన్నారు.. మరోవైపు ఈ తీర్పుపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ” దోషికి కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వినిపించాయి. తాను తీర్పు మాత్రం ఎందుకు విరుద్ధంగా వచ్చింది. కోర్టు తీర్పుతో అసంతృప్తికి గురి చేసిందని” మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....

High Protein Breakfast: ఉదయం, సాయంత్రం ఈ పదార్థం తింటే రుచితో పాటు ప్రోటీన్స్.. ఎలా తయారు చేయాలంటే..

High Protein Breakfast: ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యకరమైన లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే అధికంగా ప్రోటీన్లు ఇచ్చే పదార్థాలు అధిక ఖర్చుతో కూడుకొని ఉన్నాయి....

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Oktelugu Epaper
Exit mobile version