Mana Shankara Varaprasad Garu: తెలంగాణ లో పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు విషయం లో హై కోర్టు చాలా సీరియస్ గా ఉంది . చూస్తుంటే ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ఏ సమస్య లేనట్టు తెలంగాణ హై కోర్టు ఎందుకు సినీ ఇండస్ట్రీ పై ఇంత పగబట్టింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో ని జారీ చేసింది. కానీ ఈ జీవో ని బయటకు చూపించలేదు. చూపిస్తే ఎక్కడ మళ్లీ టికెట్ రేట్స్ ని రద్దు చేస్తారో అనే భయం కావొచ్చు. ఈ విషయం హై కోర్టు కి తెలియడం తో, తెలంగాణ ప్రభుత్వం పై, మూవీ టీం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే జనవరి 8 వ తేదీన ‘మన శంకర వరప్రసాద్ గారు’ టికెట్ రేట్స్ ని పెంచుతూ జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమని రీసెంట్ గానే ఒకరు హై కోర్టు లో పిటీషన్ వేశారు. జనవరి 11 న రాత్రి 8 గంటల ప్రీమియర్ షోకు ఒక్కో టికెట్ కి 600 రూపాయిలు(GST తో కలిపి) కి అమ్మడం అక్రమం అని ఆ పిటీషన్ ఆరోపణ. అంతే కాకుండా జనవరి 12 నుండి జనవరి 18 వరకు సింగిల్ స్క్రీన్స్ లలో 50 రూపాయిలు, మల్టీప్లెక్స్ స్క్రయిన్స్ లో 100 రూపాయిలు అదనంగా వసూలు చేసారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. కేవలం ఈ ధరల పెంపు కారణంగా అక్రమ ఆదాయం 45 కోట్ల వరకు వచ్చిందని పిటీషనర్ వాదన. ఇక నుండి అయినా టికెట్ రేట్స్ పెంపు చట్టవిరుద్ధమని అధికారికంగా ప్రకటించాలంటూ పిటీషనర్ హై కోర్టు ని కోరారు. ఈ పిటీషన్ ని స్వీకరించిన హై కోర్టు ప్రతివాదులకు నోటీసులు జరీ చేసింది.
పెంచిన ధరలపై అమ్ముడైన టిక్కెట్ల సంఖ్య, వాటి ద్వారా వచ్చిన డబ్బుల వివరాలను సమర్పించాలని GST అధికారులను కోర్టు ఆదేశించింది. అంటే ఇప్పుడు అక్రమంగా 45 కోట్ల రూపాయిలు వసూలు అయ్యాయి అనేది నిరూపిస్తే , మన శంకర వరప్రసాద్ టీం ఆ 45 కోట్ల రూపాయిలను వెనక్కి ఇవ్వాలా?, అసలు ఎందుకు ఈ అంశాన్ని ఇంత సాగదీస్తున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి, పేదవాడు ప్రైవేట్ స్కూల్ లో చదువుకునే పరిస్థితి లేదు, లక్షల్లో ఫీజులు గుంజుకుంటున్నారు. వీటిపై ఎందుకు ఎవ్వరూ కేసులు వెయ్యరు?, ఇష్టముంటే చూస్తారు,లేదంటే లేదు, సినిమా అనేది ఒక ఛాయస్, అలాంటి రంగం మీద ఎందుకు ఇంత పగబడుతున్నారో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.