తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దేవుడి ఆదేశిస్తే పాటిస్తానంటూ చెప్పే రజనీకాంత్ కు ఆమేరకు సూచన వచ్చిందో లేదో తెలియడం లేదు. అయితే రజనీకాంత్ రాజకీయ తెరగ్రేటంపై ఆయన దాగుడుమూతలు ఆడుతుండటంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఏం చెప్పారంటే..?
రజనీకాంత్ మూడేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు. ఈ ఏడాది మార్చిలోనూ ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలపై మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితుల రీత్య రజనీకాంత్ రాజకీయ ఆలోచనను విరమించుకున్నారనే టాక్ విన్పిస్తోంది. దీంతో రజనీకాంత్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై నెట్టింట్లో ఓ లేఖ వైరల్ అయింది. అయతే ఈ లేఖపై రజనీకాంత్ స్పందిస్తూ ఇది తాను రాసింది కాదని స్పష్టం చేశాడు. కాగా ఈ లేఖలో తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయాలు మాత్రమే కరెక్టేనని చెప్పారు. ప్రస్తుతం తనకు కిడ్నీ సమస్య ఉందని.. డయాలసిస్ వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారని తెలిపారు.
Also Read: బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తాను మునుపటిలా బయటికి వెళ్లడం ప్రమాదకరమేనని చెప్పారు. తన ఆరోగ్యం రీత్య తాను రాజకీయాల్లో కొనసాగాలా? మక్కల్ మండ్రమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇక ఎప్పటిలాగే సరైన సమయంలో రాజకీయ ఎంట్రీపై నిర్ణయం ప్రకటిస్తానని తలైవా స్పష్టం చేశాడు. దీంతో రజనీ పొలికల్ ఎంట్రీ ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది.