ఆరోగ్య సమస్యలు ఉన్న మాట నిజమేనంటున్న రజినీ

వెండితెర మీద సూపర్ స్టార్ రజనీకాంత్ ఛరీష్మాను పూర్తిగా ఎంజాయ్ చేసిన అభిమానులు ఇక ఆయన సినిమాలు చాలించి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఆకస్మిక మరణంతో ఆ స్థానాన్ని పూరించగల వ్యక్తి రజినీ మాత్రమేనని అభిమానులు ఆయన్ను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రజినీ కొన్నాళ్లపాటు మౌనంగానే ఉండి చివరకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోనని, యోగ్యుడైన […]

Written By: admin, Updated On : October 29, 2020 7:26 pm
Follow us on


వెండితెర మీద సూపర్ స్టార్ రజనీకాంత్ ఛరీష్మాను పూర్తిగా ఎంజాయ్ చేసిన అభిమానులు ఇక ఆయన సినిమాలు చాలించి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఆకస్మిక మరణంతో ఆ స్థానాన్ని పూరించగల వ్యక్తి రజినీ మాత్రమేనని అభిమానులు ఆయన్ను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వమని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ రజినీ కొన్నాళ్లపాటు మౌనంగానే ఉండి చివరకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోనని, యోగ్యుడైన వ్యక్తిని నిర్ణయించి కూర్చోబెడతానని అన్నారు.

Also Read: ‘మీటూ’ వివాదంలోకి మణిరత్నంను లాక్కొచ్చిన చిన్మయి

అయితే రజినీ చెప్పిన ఎంట్రీ సమయం దగ్గరపడింది. త్వరలోనే తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోనే రజినీ తన పొలిటికల్ పార్టీని బరిలో నిలుపుతానని అన్నారు. కానీ కోవిడ్ రావడంతో ఆయన ఆలోచనలకు బ్రేకులు పడ్డాయి. అయితే నిన్నటి నుండి రజినీకాంత్ కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకోవడం వలన ఆయనకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఇలాంటి సమయంలో బయటికొచ్చి సభలు, సమావేశాలు పెడితే ఆయన ఆరోగ్యం చిక్కుల్లో పడుతుందని కనుక ఈసారి ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయదనే వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read: బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!

రజినీ పేరిట పై సంగతులతో ఒక లేఖ కూడ చక్కర్లు కొట్టింది. అది ఆయన అభిమానుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీంతో రజినీకాంత్ స్పందించారు. ఆ లేఖ తాను రాయలేదని చెప్పిన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని, కానీ అందులో చెప్పబడినట్టు తనకు ఆరోగ్య సమస్యలు ఉన్న మాట మాత్రమే వాస్తవమని అన్నారు. అలాగే రాజకీయాలు విషయమై తన రజినీ మక్కల్ మండ్రం కమిటీ సభ్యులతో మాట్లాడినా త్వరలోనే ఒక నిర్ణయం చెబుతానని స్పష్టతనిచ్చారు.