Farming: అందరు అమెరికా అంటే ఎగిరి గంతేస్తారు. అందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటే అందరికి ఇష్టమే. కానీ అతడు మాత్రం కన్న ఊర రుణం తీర్చుకోవాలని భావించాడు. ఉన్నఊళ్లోనే వ్యవసాయం చేయాలని తలపించాడు. ఉద్యోగం వదులుకుని సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాడు. మెలకువలు తెలుసుకుని తక్కువ పెట్టుబడితోనే సిరులు కురిపిస్తున్నాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పది మందికి దారి చూపుతూ తనలోని మక్కువ చూపుతున్నాడు. వ్యవసాయంలోనే ఆదాయం రెట్టింపు వస్తుందని నిరూపిస్తున్నాడు.
పనులు అందరు చేస్తారు కానీ పద్దతిలో చేయడం కొందరికే అలవాటు. అదే కోవలో నిలుస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన రైతు డి.ఎస్.నారాయణ సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా స్వదేశానికి తిరిగి వచ్చి వ్యవసాయంలో పంటలు పండించడంలో వినూత్న పద్ధతులు తెలుసుకున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఎలా సంపాదించాలనే దానిపై ఎక్కువగా దృష్టి సారించి సఫలం చెందాడు. ఫలితంగా పంటలు పండించడంలో తనదైన శైలికి రూపకల్పన చేశాడు.
Also Read: Pawan Kalyan: టమాటకున్న విలువ పవన్ కల్యాణ్ సినిమాకు ఉండదా?
పంటలు పండించడంలో అన్ని రకాలను పరీక్షించాడు. దీంతో రసాయనిక ఎరువుల కంటే సేంద్రియంతోనే లాభాలు మిన్న అనే విషయం తెలుసుకున్నాడు. దీంతో నేటి వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకంతో కలిగే నష్టాలపై జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు. సేంద్రియ ఉత్పత్తులతోనే అధిక దిగుబడి సాధ్యమని రుజువు చేస్తున్నాడు. తన పంటల్లో సేంద్రియ ఎరువులు వాడుతూ వాటిని మార్కెటింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.
పంటలు పండించడంలో నేడు అనేక మార్గాలు వస్తున్నాయి. కానీ రసాయన ఉత్పత్తులను దూరం చేస్తేనే నేల స్వభావం మారుతుందని మనం గతంలోనే చదువుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిరక్షరాస్యులైన రైతులు రసాయనిక ఎరువులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో నేల బలం కూడా క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా పంట దిగుబడిపై పెను ప్రభావం చూపుతోందని తెలుసుకోలేకపోతున్నారు. అయినప్పటికీ నారాయణ చేపడుతున్న వ్యవసాయంపై అందరు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Free Ration: మరో నాలుగు నెలల పాటు ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం పచ్చజెండా