https://oktelugu.com/

Prabhas Remuneration: ప్రభాస్ రెమ్యునరేషన్ తో ఎన్టీఆర్, మహేష్, పవన్ లతో మూడు సినిమాలు చేయవచ్చు!

Prabhas Remuneration: పాన్ ఇండియా స్టార్ కాదు ప్రభాస్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ హీరోగా మారిన ప్రభాస్ తో మూవీ చేయాలంటే కనీసం నాలుగు వందల కోట్లు కావాలి. రాధే శ్యామ్ నుండి స్పిరిట్ మూవీ వరకు ప్రభాస్ చేస్తున్న ఐదు చిత్రాల బడ్జెట్ లెక్కేస్తే అటూ ఇటూ గా రూ. 2000 కోట్లు ఉంటుంది. అది ఆయన రేంజ్. విదేశాలలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ప్రస్తుత […]

Written By:
  • Shiva
  • , Updated On : November 25, 2021 9:59 am
    Follow us on

    Prabhas Remuneration: పాన్ ఇండియా స్టార్ కాదు ప్రభాస్ ని గ్లోబల్ స్టార్ అంటున్నారు. వందల కోట్ల బడ్జెట్ హీరోగా మారిన ప్రభాస్ తో మూవీ చేయాలంటే కనీసం నాలుగు వందల కోట్లు కావాలి. రాధే శ్యామ్ నుండి స్పిరిట్ మూవీ వరకు ప్రభాస్ చేస్తున్న ఐదు చిత్రాల బడ్జెట్ లెక్కేస్తే అటూ ఇటూ గా రూ. 2000 కోట్లు ఉంటుంది. అది ఆయన రేంజ్. విదేశాలలో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ప్రభాస్ ప్రస్తుత రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. బాలీవుడ్ రేంజ్ కూడా దాటేసిన ప్రభాస్.. హాలీవుడ్ హీరోల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.
    Prabhas
    మొన్నటి వరకు సినిమాకు రూ. 100 కోట్లు తీసుకున్న ప్రభాస్… బాలీవుడ్ లో చేస్తున్న రెండు స్ట్రైట్ ఫిలిమ్స్ కి రూ. 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. దర్శకుడు ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్… దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ చిత్రాలకు ప్రభాస్ రెమ్యునరేషన్ రూ. 150 కోట్లని తెలుస్తుంది. బడ్జెట్ రీత్యా.. ప్రభాస్ అంత మొత్తంలో తీసుకుంటున్నారట. దీనిపై బాలీవుడ్ మీడియా ప్రత్యేక కథనాలు రాస్తుండగా.. అక్కడి టాప్ స్టార్స్ కూడా నోరెళ్ల బెడుతున్నారు. ఇండియాలో వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలుగా సల్మాన్, అక్షయ్ కుమార్, రజినీకాంత్ రికార్డులకు ఎక్కారు. ఇప్పుడు ప్రభాస్ వాళ్లందరినీ దాటివేశాడు.

    Also Read: Pawan Kalyan: టమాటకున్న విలువ పవన్ కల్యాణ్ సినిమాకు ఉండదా?

    ఇక టాలీవుడ్ లో ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరూ లేరు. మహేష్, పవన్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్ కూడా రూ. 70 కోట్ల లోపే. అసలు మొన్నటి వరకూ కూడా యాభై కోట్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ప్రభాస్ మినహా ఎవరూ లేరు. దీంతో ప్రభాస్ కి ఒక్క సినిమాకు ఇచ్చే రెమ్యునరేషన్ తో పవన్, మహేష్, ఎన్టీఆర్ వంటి బడా స్టార్స్ తో మూడు చిత్రాల చేయవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాహుబలి చిత్రానికి ముందు ప్రభాస్ ఈ స్టార్స్ కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం.

    Also Read: Film industry: సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ పెత్తనమేమిటి?

    Tags