TSPSC Paper Leak: పేపర్ల లీక్.. టీఎస్ పీఎస్సీ సెక్రటరీ, కమిటీ సభ్యుడికి మెడకు కేసు?

TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ చెబుతున్న మాటలు కూడా అబద్ధమని తేలిపోతున్నాయి.. ఎందుకంటే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే 15 మందిని అదుపులోకి తీసుకుంది.. కస్టడీలో విచారిస్తోంది. ఇక తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ […]

Written By: Bhaskar, Updated On : April 1, 2023 1:04 pm
Follow us on

TSPSC Paper Leak

TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి తవ్వుతున్న కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరూ లేరని మంత్రి కేటీఆర్ చెబుతున్న మాటలు కూడా అబద్ధమని తేలిపోతున్నాయి.. ఎందుకంటే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే 15 మందిని అదుపులోకి తీసుకుంది.. కస్టడీలో విచారిస్తోంది. ఇక తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్, బోర్డులో సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేసింది. వీరిలో అనిత రామచంద్రన్, లింగారెడ్డి సిట్ అధికారుల విచారణకు శనివారం హాజరయ్యారు. ప్రస్తుతం వీరి విచారణ కొనసాగుతోంది.. అయితే ముఖ్యంగా కస్టోడియల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు సిట్ అధికారులు అడుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇక పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. అంతేకాదు సెక్రటరీ అనిత రామచంద్రన్ కు పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. దీంతో అతడికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అన్ని విభాగాల్లోనూ ఈజీగా యాక్సిస్ ఉన్నదని సిట్ అధికారులు భావిస్తున్నారు.. తనకు యాక్సెస్ ఉండడంతో ఎక్కడికైనా సులభంగా వెళ్లేవాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిని అవకాశంగా తీసుకుని ప్రవీణ్ చాలా సులభంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ కి కుట్ర చేశాడని సిట్ గుర్తించింది. లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిన ప్రవీణ్.. సెక్రటరీ అనిత రామచంద్రన్ వద్ద పీఏ గా పనిచేస్తున్నందువల్లే ఆమెను కూడా విచారించాలని.. అందు గురించే నోటీసులు పంపించామని, ఆమెను విచారిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

TSPSC Paper Leak

మరోవైపు గ్రూప్_1 పేపర్ లీకేజీలో అరెస్ట్ అయిన రమేష్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న రమేష్ ను పోలీసులు విచారించి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సిట్ అధికారులు లింగారెడ్డికి నోటీసు జారీ చేసి, విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.. అనిత రామచంద్రన్, లింగా రెడ్డి ని విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న అనంతరం కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా విచారిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. మరో వైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్న పత్రాలను భద్రపరిచే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జి శంకర లక్ష్మి ని సిట్ అధికారులు పదిసార్లు విచారించారు. ఆమెను సుమారు 20 గంటల పాటు విచారించిన అధికారులు.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో జరిగే అన్ని కార్యకలాపాలపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ పై శంకర లక్ష్మి తో పాటు, కమిషన్ సెక్రటరీ, చైర్మన్ లకు మాత్రమే అజమహర్షి ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే చైర్మన్, సెక్రటరీని విచారించేందుకు సిట్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.