నేతల తారక మంత్రం.. రాష్ట్రంలో చర్చనీయాంశం..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు కచ్చితంగా జరుగుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కొందరు ముఖ్యనేతలు సైతం ఆజ్యం పోస్తున్నారు. సీనియర్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ సీఎం అయితే తప్పు ఏమిటని వాదిస్తున్నారు. పలువురు బహిరంగంగానే ఆ మాటలు అంటున్న సందర్భాలు ఇటీవల చాలా ఉన్నాయి. ఇక గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఒకడుగు ముందుకేశారు. కేటీఆర్ ఎదుటనే కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు సభాముఖంగానే చెప్పేశారు. ఇది […]

Written By: Srinivas, Updated On : January 23, 2021 1:54 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు కచ్చితంగా జరుగుతుందని కొద్దిరోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కొందరు ముఖ్యనేతలు సైతం ఆజ్యం పోస్తున్నారు. సీనియర్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కేటీఆర్ సీఎం అయితే తప్పు ఏమిటని వాదిస్తున్నారు. పలువురు బహిరంగంగానే ఆ మాటలు అంటున్న సందర్భాలు ఇటీవల చాలా ఉన్నాయి. ఇక గురువారం డిప్యూటీ స్పీకర్ పద్మారావు అయితే ఒకడుగు ముందుకేశారు. కేటీఆర్ ఎదుటనే కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు సభాముఖంగానే చెప్పేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Also Read: బీజేపీతో పొత్తుపై స్పందించిన పవన్..

అయితే డిప్యూటీ స్పీకర్ పద్మరావు.. కేటీఆర్ ముఖ్యమంత్రి అనే ఊహాగానాలకు మరింత వేడెక్కించే అంశాలను బయటపెట్టారు. ఇప్పటికే కాబోయే సీఎం కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన పద్మారావు.. మరో అడుగు ముందుకేసి త్వరలో పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ.. ప్రకటించారు. కేటీఆర్ సీఎం అవగానే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సంచలన ప్రకటన చేశారు.

టీఆర్ఎస్ నేతల నుంచి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే… సీఎంగా కేటీఆర్ కు పట్టాభిషేకం.. అవననేది నిజమేనా అనే అనుమానం కలుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా వచ్చే నెలలో మహూర్తం ఖాయం అయ్యిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఒకవేళ కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కెబినెట్లో ప్రక్షాళన తప్పదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: అమ్మ ఒడిని మించిన పథకం తెస్తున్న సీఎం జగన్

అయితే టీఆర్ఎస్ నాయకులు ఇంత హడావుడిగా.. తారక మంత్రం ఎందుకు జపిస్తున్నారంటే.. వచ్చే నెలలో ఒకవేళ సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసినా.. చేయకపోయినా.. తరవాత అయినా మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేది కేటీఆర్ యే కదా అనే భావనలో గులాబీ నేతలు ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు కూడా భవిష్యత్ లో తమస్థానాలు పదిలం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ‘కేటీఆర్ సీఎం’ అనే జపం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్