https://oktelugu.com/

నెటిజన్ల ట్రోలింగ్ తో ఫోటో డిలీట్ చేసిన సమంత..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి తరువాత హీరోయిన్లకు అవకాశాలు రావని చాలామంది అపోహ పడతారు. అయితే ప్రతిభ ఉంటే పెళ్లి తరువాత కూడా అవకాశాలు పుష్కలంగా వస్తాయని సమంత ప్రూవ్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తున్న సమంత మరోవైపు వెబ్ సిరీస్ లతో పాటు ఆహా ఓటీటీలో సామ్ జామ్ లాంటి షోలు కూడా చేస్తున్నారు. బుల్లితెర, వెండితెర, ఓటీటీల్లో ప్రూవ్ చేసుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సమంత సంపాదించుకున్నారు. Also Read: అల్లరోడి ఆశలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 01:42 PM IST
    Follow us on

    సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లి తరువాత హీరోయిన్లకు అవకాశాలు రావని చాలామంది అపోహ పడతారు. అయితే ప్రతిభ ఉంటే పెళ్లి తరువాత కూడా అవకాశాలు పుష్కలంగా వస్తాయని సమంత ప్రూవ్ చేస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తున్న సమంత మరోవైపు వెబ్ సిరీస్ లతో పాటు ఆహా ఓటీటీలో సామ్ జామ్ లాంటి షోలు కూడా చేస్తున్నారు. బుల్లితెర, వెండితెర, ఓటీటీల్లో ప్రూవ్ చేసుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సమంత సంపాదించుకున్నారు.

    Also Read: అల్లరోడి ఆశలు ఈ సినిమాపైనే.. కల నెరవేరుతుందా..?

    సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ ఒడిలో కాళ్లు పెట్టుకున్న ఫోటోను సమంత షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అయింది. ఈ ఫోటోకు పాజిటివ్ కామెంట్స్ తో పోల్చి చూస్తే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి సమంతకు ప్రీతమ్ స్టైలిష్ట్ గా ఉన్నారు.

    Also Read: వామ్మో.. సాయితేజ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

    ప్రీతమ్ తో ఉన్న స్నేహానికి గుర్తుగా ఐలవ్యూ అని కామెంట్ చేస్తూ సమంత ఫోటో షేర్ చేయగా అక్కినేని అభిమానులకు సైతం ఆ ఫోటో నచ్చలేదు. సమంత వేరే వ్యక్తిపై కాళ్లు పెట్టుకుని ఫోటో దిగడం ఏమిటని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సమంతను దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో సమంత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి ఫోటోను డిలీట్ చేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    సమంత ఫోటోను డిలీట్ చేసినా అప్పటికే ఆ ఫోటోకు సంబంధించిన స్క్రీన్ షాట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. గతంలో సమంత ట్రోలింగ్ ను ఎదుర్కొన్నా ఈ స్థాయిలో సామ్ ను నెటిజన్లు ట్రోల్ చేయడం ఇదే తొలిసారి. అయితే సమంత అభిమానులు మాత్రం సామ్ పొరపాటున స్టోరీస్ లో ఆ ఫోటోను యాడ్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.