https://oktelugu.com/

అల్లరోడి ఆశలు ఈ సినిమాపైనే.. కల నెరవేరుతుందా..?

అల్లరి సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి కామెడీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అల్లరి నరేష్. కెరీర్ మొదట్లో అల్లరి నరేష్ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి. అయితే 2012 సంవత్సరంలో విడుదలైన సుడిగాడు సినిమా తరువాత నరేష్ నటించిన సినిమాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. Also Read: నెటిజన్ల ట్రోలింగ్ తో ఫోటో డిలీట్ చేసిన సమంత..? ఒకప్పుడు కామెడీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 23, 2021 / 01:54 PM IST
    Follow us on

    అల్లరి సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టి కామెడీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అల్లరి నరేష్. కెరీర్ మొదట్లో అల్లరి నరేష్ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి. అయితే 2012 సంవత్సరంలో విడుదలైన సుడిగాడు సినిమా తరువాత నరేష్ నటించిన సినిమాలేవీ ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు.

    Also Read: నెటిజన్ల ట్రోలింగ్ తో ఫోటో డిలీట్ చేసిన సమంత..?

    ఒకప్పుడు కామెడీ సినిమాల ద్వారా రాజేంద్ర ప్రసాద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటే ఈ తరం హీరోల్లో అల్లరి నరేష్ కూడా కామెడీ సినిమాల ద్వారా అదే స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే ప్రేక్షకులు నవ్యత ఉన్న కథాంశాలను ఇష్టపడుతూ ఉండటం, బుల్లితెర కామెడీ షోల వల్ల నరేష్ మూస కామెడీని ప్రేక్షకులు ఇష్టపడటం లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: వామ్మో.. సాయితేజ్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..?

    నేను, విశాఖ ఎక్స్ ప్రెస్ శంభో శివ శంభో సినిమాల అభినయానికీ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ అద్భుతంగా నటించగలనని ప్రూవ్ చేసిన అల్లరి నరేష్ మధ్యలో కొన్ని సీరియస్ సినిమాల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. నందిని నర్సింగ్ హోం ఫేమ్ గిరి డైరెక్షన్ లో తెరకెక్కిన బంగారు బుల్లోడు సినిమా నేడు విడుదల కాగా ఈ సినిమా రిజల్ట్ తెలియాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాకట్టు పెట్టిన బంగారాన్ని రెంట్ కు ఇచ్చే పాత్రలో నరేష్ నటించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల జోరు తగ్గడంతో బంగారు బుల్లోడు సినిమాకు థియేటర్లు బాగానే దక్కాయి. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలన్న అల్లరి నరేష్ కల ఈ సినిమాతో అయినా నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.