Homeఆంధ్రప్రదేశ్‌నేతల వ్యాఖ్యలు.. కోర్టుకు తీర్పు తిప్పలు

నేతల వ్యాఖ్యలు.. కోర్టుకు తీర్పు తిప్పలు

AP High Court
ఏపీలో అధికార పార్టీ నేతల నోటి దురుసు కోర్టులో జడ్జీలకు తల నొప్పిగా మారుతోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఉద్దేశించి ఇప్పటి పలువురు వ్యాఖ్యలు చేయగా.. ఏపీ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల నిమ్మగడ్డను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై నిజానిజాలను తేల్చడం ఇప్పుడు కోర్టుకే కష్టంగా మారింది. తొలుత నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పుటేజీ అడిగిన కోర్టు తరువాత.. దానిపై ఎటూ తేల్చలేకపోయింది. దీంతో కేసు వాయిదా పడింది. ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Also Read: టీడీపీ వర్సెస్ నిమ్మగడ్డ..?

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. రేషన్ వాహనాల పై వచ్చిన కథనాలపై స్పందించారు. తరువాత పంచాయతీ పోరులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. విజయం తమదేనని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. నిమ్మగడ్డపై పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో నిమ్మగడ్డ సీనియస్ అయ్యారు. ప్రెస్ మీట్ ముగిసిన గంటలోపే నానికి నిమ్మగడ్డ నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ముగిసేవరకు మీడియాతో మాట్లాడొద్దని.. ఇంటికే పరిమితం కావాలని.. ఈ దిశగా.. కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ.. నాని హై కోర్టును ఆశ్రయించారు.

మంత్రి కొడాలినాని తనపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన వివరణ తీసుకుని మరీ… చర్యలకు ఆదేశించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఆయన వ్యాఖ్యలను సమగ్రంగా సమర్పించడంలో విఫలం అయ్యారు. వీడియో పుటేజీ లేకుండా కోర్టు విచారణకు హాజరైన ఎస్ఈసీ న్యాయవాదులు… జడ్జిలను సంతృప్తి పరచలేకపోయారు. ఈ నేపథ్యంలో మరింత లోతైన విచారణ అవసరం ఉందని హై కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also Read: టీడీపీని భయపెడుతున్న మున్సిపల్ ఎన్నికలు..?

కొడాలినాని తనపై చేసని వ్యాఖ్యలపై నిమ్మగడ్డ సమర్పించిన పుటేజీ ఆధారంగా ఓ నిర్ణయానికి రాలేకపోయిన హైకోర్టు.. అసాధారణ ఈ కేసులో కోర్టుకు సాయపడేందుకు అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడిని) నియమించింది. దీంతో చిన్నకేసు కాస్తా.. పెద్ద చిక్కు ముడిగా తయారైంది. సాధారణంగా సాంకేతిక అంశాలు, ఐటీ విషయాలు, అసాధారణ విషయాలు కేసులో ఉన్నప్పుడు వాటిపై న్యాయమూర్తులకు కూడా అవగాహన ఉండదు కాబట్టి కోర్టు సహాయకులను (అమికస్‌ క్యూరీ)ని నియమిస్తారు. కానీ ఇప్పుడు కొడాలి కేసులో అమికస్‌ క్యూరీ నియామకం వెనుక మంత్రి చెబుతున్న వాక్‌ స్వాతంత్ర హక్కును తేల్చేందుకు నియమించారు.

ఎపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న చర్యలను సవాల్ చేస్తూ.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలినాని, ఎమ్మెల్యే జోగి రమేశ్ వేసిన మూడు పిటిషన్లు వారం రోజుల్లొనే తమ దృష్టికి రావడానికి హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులు లేవా అని ప్రతివాదులను ప్రశ్నించింది.వాక్ స్వాతంత్రం పరిధులు.. పరిమితులు తేల్చేందుకు అమికస్ క్యూరీని నియమించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular