విడాకుల కోసం వచ్చిన మహిళకు మత్తిచ్చి లాయర్ రేప్

కంచే చేను మేస్తే.. చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ అన్యాయానికి పాల్పడితే ఇక ఎవరికి చెప్పుకునేది. విడాకుల కోసం లాయర్ ను ఆశ్రయించిన ఆ మహిళను మానభంగం చేశాడో క్రిమినల్ లాయర్. వక్రబుద్ధితో తనను నమ్మిన అబలపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ సంఘటనను వీడియో తీసి బాధితురాలిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. సంచలనం రేపుతున్న ఈ సంఘటన B సమీపంలోని మనవళానగర్ లో చోటుచేసుకుంది. సెల్వరాజ్, రజని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) […]

Written By: Srinivas, Updated On : July 22, 2021 5:37 pm
Follow us on

కంచే చేను మేస్తే.. చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ అన్యాయానికి పాల్పడితే ఇక ఎవరికి చెప్పుకునేది. విడాకుల కోసం లాయర్ ను ఆశ్రయించిన ఆ మహిళను మానభంగం చేశాడో క్రిమినల్ లాయర్. వక్రబుద్ధితో తనను నమ్మిన అబలపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆ సంఘటనను వీడియో తీసి బాధితురాలిని బెదిరించి రూ.లక్షలు వసూలు చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. సంచలనం రేపుతున్న ఈ సంఘటన B సమీపంలోని మనవళానగర్ లో చోటుచేసుకుంది.

సెల్వరాజ్, రజని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అప్పుడప్పుడు పంచాయితీలు కూడా జరిగేవి. ఈ క్రమంలో ఇద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన భర్తతో విడాకులు తీసుకోవాలని రజని అదే ప్రాంతంలో నివసిస్తున్న క్రిమినల్ లాయర్ టార్జాన్ ను సంప్రదించింది. రజని అందాన్ని చూసి మోహించిన లాయర్ ఆమెను అనుభవించాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇదే అదనుగా భావించి నీ దగ్గర ఫీజు కూడా తీసుకోనని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు.

నీ భర్తతో విడాకులు ఇప్పించడానికి కొన్ని పత్రాలు కావాలని వాటిని తక్షణమే తీసుకుని రావాలని లాయర్ రజనికి సూచించాడు. దీంతో పేపర్లు తీసుకుని వచ్చిన రజనికి లాయర్ జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన రజని మత్తులోకి జారుకోవడంతో ఆమెను వివస్ర్తను చేసి మానభంగం చేశాడు. అంతేకాదు వాటిని వీడియో తీశాడు. అనంతరం స్పృహలోకి వచ్చిన రజని శరీరం మీద బట్టలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి లాయర్ తో గొడవ పెట్టుకుంది. నిన్ను రేప్ చేశానని పోలీస్ కేసు పెట్టినా, ఎవరికైనా చెప్పినా నీ వీడియోలు బహిర్గతమవుతాయని బెదిరించాడు.

ఇంకా రూ.7 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. దీంతో రజని హడలిపోయింది. లాయర్ భార్యకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో క్రిమినల్ లాయర్ తన మీద కేసు నమోదైందని తెలుసుకుని పరారయ్యాడు. కోడైకెనాల్ వెళ్లిన లాయర్ టార్జాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడిని తిరువళ్లూరు జిల్లా కోర్టులో హాజరు పరిచారు. విడాకులు తీసుకోవాలని వచ్చిన మహిళను అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసి రూ.7 లక్షలు డిమాండ్ చేయడం కలకలం రేపింది. లాయర్ భార్యను సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు.