ఎక్స్ క్లూజివ్: ఆర్ఆర్ఆర్ కథలో మళ్లీ అదే కాన్సెప్ట్

దర్శక ధీరుడు సినిమా అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. గుండెలు పిండేసేలా సన్నివేశాలుంటాయి. కళ్లలో నీళ్లు సుడులు తిరిగేలా తెరపై భావోద్వేగాలను పండిస్తాడు. దాంతోపాటు యాక్షన్ మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు. మగధీర నుంచి ఈగ వరకు రాజమౌళి తీసుకున్న కాన్సెప్ట్ లు చూస్తే పునర్జన్మల నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి దాన్నే నమ్ముకున్నాడని.. ‘ఆర్ఆర్ఆర్’ కథలో కీలక పాయింట్ బహిర్గతం అయ్యిందని టాక్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోలు చూస్తే బుల్లెట్ […]

Written By: NARESH, Updated On : July 22, 2021 7:02 pm
Follow us on

దర్శక ధీరుడు సినిమా అంటేనే ఫుల్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది. గుండెలు పిండేసేలా సన్నివేశాలుంటాయి. కళ్లలో నీళ్లు సుడులు తిరిగేలా తెరపై భావోద్వేగాలను పండిస్తాడు. దాంతోపాటు యాక్షన్ మిక్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు.

మగధీర నుంచి ఈగ వరకు రాజమౌళి తీసుకున్న కాన్సెప్ట్ లు చూస్తే పునర్జన్మల నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళి దాన్నే నమ్ముకున్నాడని.. ‘ఆర్ఆర్ఆర్’ కథలో కీలక పాయింట్ బహిర్గతం అయ్యిందని టాక్ నడుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోలు చూస్తే బుల్లెట్ పై కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఇక టక్ వేసుకొని దర్జాగా రాంచరణ్ కనిపించాడు. అంటే స్వాతంత్య్రానికి ముందు కథ అయితే వీరికి ఈ వేషధారణ బైక్ అనేది ఉండదు. అప్పుడు అస్సలు బైకులు లేవు.

సో ఈ కథ ఖచ్చితంగా పునర్జన్మల ఇతివృత్తంతో నడుస్తుందని తాజాగా లీక్ అయ్యింది. స్వాతంత్య్రానికి పూర్వం కొమురం భీం, అల్లూరి పాత్రదారులైన ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ చనిపోతారని మళ్లీ పునర్జన్మ ఎత్తుతారని టాక్ నడుస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరిస్థితి ఏంటి? వీళ్లిద్దరూ కలుసుకుంటే ఎలా ఉంటుందన్న ఫిక్షనల్ కథతో ప్రతీకారం తీర్చుకున్న యోధుల కథను రాజమౌళి మూవీ తెరకెక్కిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.

తము పూర్వజన్మలో సాధించలేకపోయిన ఆశయాలను మళ్లీ పుట్టాక ఎలా కొనసాగించారన్న కథను క్లైమాక్స్ వరకూ రాజమౌళి తీర్చిదిద్దాడని.. ఇందులో ఆసక్తికర మలుపులు ట్విస్టులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఇది నిజమా? అబద్ధమా? అన్నది సినిమా విడుదలైతే కానీ తెలియదు. అప్పటివరకు ఆగాల్సిందే?