జల దిగ్బంధంలో నిర్మల్, భైంసా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసరిగా గేట్లు ఎత్తి నీరు వదిలేయడంతో భైంసా ఆటోనగర్ లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్, ఎస్.ఆర్. గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు […]

Written By: Suresh, Updated On : July 22, 2021 5:40 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కసరిగా గేట్లు ఎత్తి నీరు వదిలేయడంతో భైంసా ఆటోనగర్ లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్, ఎస్.ఆర్. గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయిన దాదాపు 150 మందిని అగ్నిమాపక సిబ్బంది, గజఈతగాళ్లు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.