ఇటీవల ఏపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థ మీద చేసిన ఆరోపణలు మరిచిపోక ముందే.. మరో ప్రముఖ లాయర్ సంచలన ఆరోపణలకు దిగారు. అది ఎవరిపైనో కాదు.. ఏకంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పైనే. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేపై ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఈ ఆరోపణలకు దిగారు. ట్విట్టర్ వేదిక చేసిన ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
Also Read: పోలవరం: పునరావాసాన్ని గాలికొదిలేస్తున్న కేంద్రం, ఏపీ
మధ్యప్రదేశ్ రాష్ట్రం అందించిన హెలికాప్టర్ సౌకర్యాన్ని బాబ్డే ఎలా ఉపయోగించుకుంటారంటూ లాయర్ నిలదీశారు. లాయర్ ట్వీట్ ప్రకారం.. ఈమధ్య చీఫ్ జస్టిస్ బాబ్డే మధ్యప్రదేశ్ కు వెళ్ళారట. అక్కడి వైల్డ్ లైఫ్ శాంక్చురినీ చూడటానిక సీజేకి ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేసిందట. అలాగే శాంక్చురీ చూసిన తర్వాత సొంత ప్రాంతమైన నాగ్ పూర్‌కు వచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్లోనే బాబ్డే ప్రయాణం చేశారట. బాబ్డేకి ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయటం ఏమిటి ? ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ సౌకర్యాన్ని బాబ్డే ఎలా ఉపయోగించుకుంటారంటూ ప్రశాంత్ ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఓ కీలకమైన కేసు అతి తొందరలోనే బాబ్డే ముందుకు వస్తోందట. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ తరపున గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించటంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆ 22 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Also Read: ఏపీలో పోలవరం పాలిటిక్స్? తప్పు ఎవరిది?
అయితే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు ఆ కేసే చీఫ్ జస్టిస్ బాబ్డే ముందుకే వస్తోందట. ప్రశాంత్ ఆరోపణల ప్రకారం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తు ఇప్పుడు బాబ్డే మీదే ఆధారపడుంది. ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయటమేంటి ? అందులో బాబ్డే ప్రయాణించటం ఏమిటని నిలదీశారు. మరి ప్రశాంత్ భూషణ్ ఆరోపణలపై సీజే ఎలా స్పందిస్తారో చూడాలి.