Homeఆంధ్రప్రదేశ్‌టీడీపీలో అసంతృప్తి ముసలం..! రంగంలోకి బాబు!

టీడీపీలో అసంతృప్తి ముసలం..! రంగంలోకి బాబు!

Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ ఇటీవల పార్టీ కమిటీలను ప్రకటించింది.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతలకు పదవులను అప్పజెప్పింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని నియమిస్తూ తెలంగాణకు రమణనే యథావిధిగా ఉంచింది. అయితే ఏపీ పార్టీలో కొందరికి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పోరాడుతూ అధికార పార్టీకి బలవుతున్నా తమకు అవకాశం ఇవ్వకపోవడంతో అసహనంతో ఉన్నారని చర్చ సాగుతోంది. అయితే ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న పార్టీ నేత చంద్రబాబు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

Also Read: టీడీపీ, వైసీపీ మోసాన్ని బయటపెట్టిన సోము వీర్రాజు

చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరుపున పోరాడుతున్నావారెవరు..? పార్టీకి దూరంగా ఉంటున్నవారెవరు..? అనే కోణంలో సమీక్ష నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసేవారికి సరైన పదవులు అందించాలని, దూరంగా ఉన్నవారిని పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొందరు పదవులు దక్కని వారు పార్టీకి దూరంగా ఉండే అవకాశం ఉందని, అలాంటి వారు పార్టీని వీడినా ఫర్వాలేదనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు చోటు దక్కని సీనియర్‌ నాయకులను మాత్రం ఏదో రకంగా సర్ది చెప్పే పనిలో ఉన్నారు.

అయితే పార్టీ కోసం పోరాడుతున్న వారిలో అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి కట్టబెట్టామని చంద్రబాబు చెప్పారు. అధికార పార్టీ అచ్చెన్నాయుడిని ముప్ప తిప్పలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. చివరికి జైలు జీవితం కూడా గడిపారు. అందుకే ఆయనకు అత్యున్నత పదవి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. అయితే గుంటూరు జిల్లాలోని అలపాటి రాజేందప్రసాద్‌, కృష్ణ జిల్లాలో దేవినేని ఉమామహేశ్వర్‌రావు లాంటి వారు పార్టీ కోసం పోరాడుతున్న పదవులు ఇవ్వలేకపోయామని బాబు చెప్పుకొచ్చారు. సమతూకం ఉండేలా కమిటీలను నియమించామని, అందుకే కొందరికి అవకాశం రాలేదన్నారు.

Also Read: జగన్‌ లేఖపై మరో ఆసక్తికర పరిణామం!

ఇక పార్టీ అధికార ప్రతినిథిగా ఉన్న పంచుమర్తి అనురాధ అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆమె కుటుంబ వ్యాపారంపై కన్నెర్ర జేసింది. అయినా తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అయితే ఆమెకు టీడీపీ నియామకాల్లో చోటు దక్కకపోవడంతో అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి సైతం తనకు పదవి దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇలాంటి వారికి ఏదో ఒక పదవిలో సర్దుబాటు చేయాలని బాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version