
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చల్లో ఢిల్లీ’ శనివారం కూడా కొనసాగింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ రాజధానిలోనే బైఠాయిస్తామంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. బురారీలోని నిరంకారీ మైదనాంలో రైతులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇచ్చిన పోలీసులు.. పంజాబ్ – హరియాణాకు చెందిన రైతులు సింఘులో ఇంకా తమ నిరసనను విరమించలేదు.
Also Read: నాడు అంజయ్య.. నేడు కేసీఆర్.. టీఆర్ఎస్ అటాక్
అక్కడే బైఠాయించి తమ ఆందోళన కొనసాగిస్తామంటూ తేల్చి చెప్పారు. అయితే.. పంజాబ్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ భారీ ఎత్తున స్తంభించింది. ఈ నేపథ్యంలో వారితో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. శుక్రవారం చేపట్టిన ఆందోళనతో రోడ్లపైనే వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులు.
ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శనివారం కూడా భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి. ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 30 మంది రైతులు నిరంకారీ మైదానానికి చేరుకున్నారు. మధ్యాహ్నానికి మరికొంత మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం చాలా మంది రైతు సంఘాల నాయకులు గ్రౌండ్‌కు రావడానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఇంకా సరిహద్దుల్లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు.
Also Read: మంటపెట్టిన బీజేపీ ఎంపీ.. భగ్గుమన్న జనసేన..పొత్తు క్యాన్సిల్?
ఇప్పటికే చాలా మంది రైతులు ఢిల్లీ చేరుకోగా..నేడు మరికొన్ని రాష్ట్రాల రైతులు కూడా ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఆయా రాష్ట్రాల నుంచి రైతులు బృందాలుగా బయలుదేరారని తెలుస్తోంది. పంజాబ్‌లోని ఫతేగాఢ్ నుంచి మరికొంత మంది రైతులు ట్రాక్టర్లలో బయల్దేరారు. డిసెంబర్ 3న చర్చలు చేపట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. అప్పటివరకు రైతులు ఆందోళనను విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్