Homeఆంధ్రప్రదేశ్‌Y S Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అయిన ‘లేడీ’...

Y S Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సూత్రధారి అయిన ‘లేడీ’ ఎవరూ?

Y S Vivekananda Reddy: ప్రభుత్వం చేతిలో ఉంది. అధికారం చేతిలో ఉంది. వ్యవస్థలు చేతిలో ఉన్నాయి. చిటికేస్తే పని జరిగిపోతుంది. అటువంటిది మూడేళ్లు గడుస్తున్నా సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని హత్య కేసును మాత్రం సీఎం జగన్ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. దీనిపై రాజకీయ సర్కిళ్లలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు సీబీఐ విచారణ కొన్ని నెలలుగా సాగుతునే ఉంది. దీనిపై తాజాగా రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ నత్తనడకన సాగడంపై ప్రశ్నించింది. కొన్ని ఆదేశాలు సైతం ఇచ్చింది. అయితే సీబీఐ విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు సూత్రధారిని సీబీఐ కనిపెట్టారని.. ఆ సూత్రధారికి సంబంధించిన ఆధారాల కోసమే ఆగుతున్నారన్న ప్రచారం పులివెందులలో విస్తృతంగా జరుతోంది. ఇప్పటివరకూ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలే ప్రధాన నిందితులుగా అంతా భావించారు. కానీ వారి వెనుక అద్రుశ్య శక్తి ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఆమెను టచ్ చేస్తే రాజకీయంగా ప్రకంపనలు సైతం రేగే అవకాశముంది. అందుకే సీబీఐ కొన్ని ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేస్తే కేస్ క్లోజ్ అయిపోతుందనుకుంటే… జగన్ ఎప్పుడో చేయనిచ్చేవారని.. అయితే అది అంతటితో ఆగదని.. ఓ లేడీని తెరపైకి తెస్తారన్న భయం ప్రభుత్వ అధినేతను వెంటాడుతోంది. ఎవరో కాంట్రాక్టర్ ని బెదిరించారని సమీప బంధువునే జైలుకు పంపించిన జగన్ ..సొంత బాబాయ్ ను హత్య చేసిన వారి విషయంలో ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే కేసును కానీ ముందుకు వదిలితే చాలా రకాల చిక్కులు వస్తాయనే తాత్సారం చేస్తున్నారన్న ప్రచారమైతే సాగుతోంది.

Y S Vivekananda Reddy
Y S Vivekananda Reddy

జగన్ కు భారీ డ్యామేజ్

ఆయన మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్. అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మాత్రం చిక్కుముడి వీడలేదు. అయితే ఎన్నికల ముందు రాజకీయంగా లబ్ధి చేసిన ఈ ఘటన.. ఇప్పుడు మాత్రం సీఎం జగన్ ను భారీగా డ్యామేజ్ చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మొదటి నుంచి సంచలనాత్మకంగా మారింది. ఎందుకంటే అంతా బహిరంగమే .. కానీ ఒక్కరూ బయటకు చెప్పరు. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. అంతా ఓపెన్ సీక్రెట్. కడప ప్రజలందరూ.. తమ పిచ్చాపాటి కబుర్లులో, అంతర్గత సమావేశాల్లో అసలు హంతకులెవరో చెప్పుకుంటూ ఉంటారు. అయితే కేసులు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి కావాల్సింది సాక్ష్యాలు. ఈ విషయంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను అరెస్ట్ చేయడానికి కావాల్సిన సాక్ష్యాలు సీబీఐ వద్ద ఉన్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చేయడం లేదు. ఈ విషయంలో కేంద్ర పెద్దల అనుమతి రాలేదో? లేకుంటే రాష్ట్ర పెద్దలు అడ్డుపడుతున్నారో తెలియదు కానీ.. సీబీఐ మాత్రం జాప్యం చేస్తోంది. అయితే కేసు కొలిక్కి వస్తున్న తరుణంలో సీబీఐ అధికారులకు బెదిరింపులకు దిగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సీబీఐ అధికారుల కారు డ్రైవరుకు ముసుగు వ్యక్తి బహిరంగంగా హెచ్చిరకలు జారీచేశాడు. అధికారులు ఎక్కడకు వెళుతుంది? ఎవరెవర్నీ కలుస్తున్నది? సమయం, వాహనాల నంబర్లతో సహా చెప్పాడంటే కేసు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో జనాభా తగ్గుతోందా?

త్వరలో అద్భుతం

రాష్ట్రంలో త్వరలో అద్భుతం జరిగిపోతుందని ఒకరు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరొకరు ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనే త్వరలో అద్భుతం జరగబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంచలన ముగింపు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే ఈ హత్య కేసులో అసలు సూత్రధారిని బయటకు తీయాలని పట్టుదలగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది బయటపడితే రాజకీయంగానూ సంచలనం అవుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి సీబీఐ సైలెంట్‌గా ఉంది.. ఏం చేస్తుందనేది ఎవరికీ తెలియడంలేదు. కానీ వీరోచితంగా ముందడుగా వేసి… వైఎస్ వివేకా హత్య కేసు నిందితుల్ని పట్టుకోవాలంటే.. సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: Anchor Sravanthi: -ఫొటో గ్యాలరీ: యాంకర్ స్రవంతి అందాల విందు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version