AP Govt Fish Mart: సర్కారు వారి చేపల షాపులు అట్టర్ ప్లాఫ్

AP Govt Fish Mart: నేలవిడిచి సాము చేస్తున్న ఏపీ సర్కారు పాలనలో అడుగడుగున వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వ చర్యలపై అన్నివర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలకు శుచి, శుభ్రమైన ఆహారం అందించే వీలుగా ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర ఫీట్ ఆంధ్రా సర్కారు వారి చేపలు, రొయ్యల వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా హబ్‌లు, ఫిష్‌ మార్ట్‌లు మూతపడే స్థితికొచ్చాయి. ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్లు రాష్ట్ర వ్యాప్తంగా […]

Written By: Dharma, Updated On : May 13, 2022 12:26 pm
Follow us on

AP Govt Fish Mart: నేలవిడిచి సాము చేస్తున్న ఏపీ సర్కారు పాలనలో అడుగడుగున వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలనను గాలికొదిలేసిన ప్రభుత్వ చర్యలపై అన్నివర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలకు శుచి, శుభ్రమైన ఆహారం అందించే వీలుగా ఏర్పాటుచేసిన ఫిష్ ఆంధ్ర ఫీట్ ఆంధ్రా సర్కారు వారి చేపలు, రొయ్యల వ్యాపారం సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్వా హబ్‌లు, ఫిష్‌ మార్ట్‌లు మూతపడే స్థితికొచ్చాయి. ఫిష్ ఆంధ్ర అవుట్ లెట్లు రాష్ట్ర వ్యాప్తంగా 14 వేలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకూ ఏర్పాటు చేసినవి సుమారు 300 మాత్రమే. వాటిలోనూ సగానికిపైగా సక్రమంగా నడవడం లేదు. ఇప్పటికే మద్యం షాపులను సొంతగా నడుపుతున్న ప్రభుత్వం ఫిష్‌ మార్ట్‌ల పేరుతో చేపలు, రొయ్యల వ్యాపారం చేపట్టింది. ఆక్వా ఉత్పత్తులకు స్థానికంగా మార్కెట్‌ కల్పించి, స్థానికంగా ఆహార వినియోగాన్ని పెంచాలనే ఉద్ధేశంతో.. జనానికి తాజా చేపలు, రొయ్యల రుచి చూపించడానికి కొన్ని పట్టణాల్లో రిటైల్‌ అవుట్‌లెట్లను తెరిపించింది. ఆక్వా హబ్‌ నుంచి కిలో చేపలు రూ.130కు తెచ్చి, రిటైల్‌ అవుట్‌లెట్‌లో రూ.150-160 చొప్పున అమ్మాల్సి ఉంటుంది. రవాణా ఖర్చులను అవుట్‌లెట్‌ నడిపేవారే భరించాలి.

AP Govt Fish Mart

సులువైన పని కాదు

అవుట్ లెట్ లు నడపం అంతా ఈజీ కాదు. అమ్ముడుపోని సరుకును కూలింగ్‌లో ఉంచాలి. చేపలు, రొయ్యలు తాజాగా ఉండకపోతే.. కొనుగోళ్లు సాగవు. వీటిని తాజాగా ఉంచడానికి శీతలీకరణ యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలి. కానీ కోల్డ్‌స్టోరేజీలు, ఫ్రిజ్‌లకు విద్యుత్‌ కోతలతో తిప్పలొచ్చాయి. జనరేటర్లపై కోల్డ్‌స్టోరేజీలు నడపాలంటే రోజుకు రెండు మూడు గంటలుజనరేటర్లు వాడినా.. అదనంగా ఖర్చవుతోంది. విద్యుత్‌ చార్జీల పెరుగుదలతో నెలకు రూ.ఐదారు వేల బిల్లు వస్తోంది. అంత బిల్లు చెల్లించడం భారంగా ఉంటోందని నిర్వహాకులు చెబుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని పులివెందులలో ఒక రిటైల్ అవుట్ లెట్ నిర్వహణ సరిగ్గా లేక మూత పడింది. కరెంటు బిల్లు బకాయి పడటంతో మూసేసుకోవల్సి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మితే లాభం పెద్దగా లేక, ఖర్చులు కూడా రాక, దుకాణాల అద్దెలు కట్టలేక.. అవుట్‌లెట్‌ నిర్వాహకులు సతమతమౌతున్నారు. ఈ సమస్యలతో రిటైల్‌ అవుట్‌లెట్ల నిర్వహణ కష్టంగా మారి, వీటిని మూసేసే పరిస్థితి వస్తోందని చెబుతున్నారు.

Also Read: Rajya Sabha: రాజ్యసభ పదవులు వారికేనా?.. వారి ఆశలపై నీళ్లు చల్లిన సీఎం జగన్

చేయి తడపనిదే..

ప్రభుత్వం ఒకవైపు పారదర్శకం అంటుంటే.. మరోవైపు మత్స్యశాఖలో చేయతపనిదే అనుమతులు ఇవ్వడం లేదు. రిటైల్‌ ఫిష్‌ అవుట్‌లెట్ల నిర్వహణ పెద్ద ఉపాధి కల్పన కేంద్రంగా ప్రభుత్వం ప్రచారం చేసింది. దీంతో చేపలు, రొయ్యల వ్యాపారంపై ఆసక్తి ఉన్న అనేక మంది యువకులు అవుట్‌లెట్లకు అనుమతుల కోసం మత్స్యశాఖను సంప్రదించారు. ఆక్వా రిటైల్‌ అవుట్‌లెట్‌కు బ్యాంకులు రూ.3లక్షల వరకు రుణం ఇస్తున్నాయి. ఇందులో 30 శాతం రాయితీ ఉంది. రూ.50వేలు లబ్ధిదారుడు మార్జిన్‌మనీగా పెట్టుకోవాలి. బ్యాంకు రుణాన్ని ఆక్వా హబ్‌లకు ఇస్తే.. అవుట్‌లెట్‌ ఏర్పాటుకు రూ.లక్ష విలువైన జర్మన్‌ పరికరాలను సరఫరా చేస్తున్నారు. అయితే రూ.లక్ష విలువైనదని చెప్తున్న ఈ మెటీరియల్‌ బహిరంగ మార్కెట్‌లో సగం కంటే తక్కువకే లభిస్తాయని చెప్తున్నారు. అయినా హబ్‌ నుంచే ఈ పరికరాలను తీసుకోవాలని అధికారులు అంటున్నారని అవుట్‌లెట్ల నిర్వాహకులు చెప్తున్నారు. రైతుకు, అవుట్ లెట్ నిర్వాహకుడి మధ్య కమీషన్లకు మత్స్యశాఖ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. రైతుకు తక్కువ ధర చెల్లించి.. అవుట్ లెట్ల నిర్వాహకుల నుంచి ఎక్కువ సూలు చేస్తున్నారు. ఇన్ని కష్టాల మధ్య అవుట్ లెట్లు నడపలేమని నిర్వాహకులు తెల్చిచెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం్ జరగడంతో కొంతమందికి ఆసక్తి ఉన్నా ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో 70ఆక్వా హబ్‌లు, 14వేల రిటైల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేయాలని మత్స్యశాఖకు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ట్రయల్‌ రన్‌గా ప్రస్తుతం 19 హబ్‌ల పరిధిలో 300 రిటైల్‌ అవుట్‌లెట్స్‌ మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇందులోనూ సగానికిపైగా సక్రమంగా నడవడం లేదని చెప్తున్నారు.

Also Read: Sarkaru Vaari Paata: పాలిటిక్స్ లో ఇరుక్కొని ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

Recommended Videos



Tags