Sajjala Ramakrishna Reddy: మూడేళ్ల తరువాత ప్రజల ముంగిటకు వస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులకు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని.. ఎలాగాలో డబ్బులు పంచుతున్నామని.. ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతాలు లభిస్తాయని వైసీపీ నేతలు కలలు కన్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. మా ఇంటికి మీరు రావొద్దు.. మీకు చెప్పిన ఒకటే..ఆ గోడకు చెప్పినా ఒకటేనంటూ ప్రజలు తిరస్కరిస్తూ ఇళ్ల తలుపులు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ పరిణామాలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. అలాగని కార్యక్రమం నిలిపివేస్తే అధిష్టానం ఆగ్రహిస్తుందని భయపడుతున్నారు. ఇప్పటికే సర్వేల పేరిట తెగ హడావుడి చేస్తుండడంతో ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే తమకు సురక్షితంగా ఉండే గ్రామాలను ఎంపిక చేసే పనిలో నేతలు పడ్డారు. అయితే ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వం కొత్తపల్లవి అందుకుంటోంది. నిరసన వ్యక్తం చేస్తున్న వారు తొలుత టీడీపీ శ్రేణులేనని చెప్పుకొచ్చింది. తాజాగా మాత్రం సంక్షేమ పథకాలకు అర్హత లేకపోవడంతో పొందలేకపోయారని.. అటువంటి వారే నిరసనలకు దిగుతున్నారని చెబుతున్నారు. మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో కవర్ చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. ఎప్పట్లాగే మీడియా ముందుకు వచ్చారు. నిరసనలు చేస్తున్న వారికి పథకాలు అందని మాట నిజమే… కానీ వారెవరూ అర్హులు కాదని తేల్చారు. అర్హత లేని వాళ్లు కూడా పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని సజ్జల చెబుతున్నారు. అయితే నిరుపేదలకు కూడా సాధించలేనంత అర్హతా ప్రమాణాలు నిర్దేశించారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఆసక్తి చూపని శ్రేణులు
వాస్తవానికి కార్యక్రమ నిర్వహణపై వైసీపీ గ్రామ స్థాయి నాయకులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తమ పనులే కానప్పుడు ప్రజల నుంచి రివర్సులు ఎలాగో ఉంటాయో వారికి తెలుసు. ఏదైనా సమస్య ఉంటే తొలుత తమతో చెబుతారని.. ఇక్కడ పరిస్కారం కాకుంటే అధికారులకు కలుస్తారు. అటువంటి తమ ముఖాలు వారికి ఎలా చూపిస్తామని వారు చెబుతున్నారు. కానీ అధిష్టాన పెద్దలు మాత్రం కార్యక్రమాన్ని కచ్చితంగా నిర్వహించాలని ఆదేశాలివ్వడంతో ఇష్టం లేకున్నా గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి రోజు నిరసనలు షాకివ్వడంతో రెండో రోజు నుంచి స్ట్రిక్ట్‌గా వైసీపీ కార్యకర్తలు.. పథకాల ద్వారా లబ్ది పొందిన వారి ఇళ్లకే వెళ్లాలని.. వీడియోలు తీసివైరల్ చేయాలని సూచనలు చేశారు. ఈ అంశంపైనా పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు టీడీపీ శ్రేణుల ఇంటి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని సాక్షి పత్రికల్లో మాత్రం పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అటువంటిదేమీ లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు బావుట వస్తుండడం.. సోషల్ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం అవుతుండడంతో ఎందుకొచ్చింది గొడవ అంటూ.. తొలి రోజు గడపగడపకూ వెళ్లిన సగం మంది ఎమ్మెల్యేలు రెండో రోజు కనిపించలేదు.
Also Read: Nose Surgery: ఉద్యోగం, వివాహాన్ని దూరం చేసిన ముక్కు సర్జరీ
తూతూమంత్రంగా..
కార్యక్రమ ప్రారంభానికే కీలక నాయకులు పరిమితమవుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలో మ మ అనిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత కాలం నిర్వహించాలో కూడా స్పష్టత లేదు. రెండేళ్ల ముందు ఇంటింటికి తిరగడం వల్ల ప్రయోజనం ఉండదని.. రాను రాను అన్ని పథకాల్లో లబ్దిదారులను తగ్గిస్తూంటే వారంతా వ్యతిరేకులుగా మారుతున్నారని వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. గ్రామాల్లో రహదారులు బాగాలేదు. ఛార్జీలు, పన్నులు అమాంతం పెరిగాయి. ఇటువంటి సమయంలో ప్రజల మధ్యకు వెళితే కనీస ఆహ్వానాలుంటాయా? పార్టీ కార్యాలయాల్లో ఉండే వారికి మా కష్టాలు ఎలా తెలుస్తాయని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కార్యక్రమాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేమని సైతం తేల్చిచెబుతున్నాయి.
Also Read: Anchor Sravanthi: -ఫొటో గ్యాలరీ: యాంకర్ స్రవంతి అందాల విందు
[…] […]