Homeఆంధ్రప్రదేశ్‌Kushboo: టాయిలెట్‌లో రహస్య కెమెరాలపై ఖుష్బు సంచలన స్పందన!

Kushboo: టాయిలెట్‌లో రహస్య కెమెరాలపై ఖుష్బు సంచలన స్పందన!

Kushboo: కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఇనిస్టిట్యూట్‌లో రెస్ట్‌రూమ్‌ వీడియో ఘటనను మతపరమైన కోణంలో చూపవద్దని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సభ్యురాలు ఖుష్బు సుందర్‌ ప్రజలను కోరారు. మహిళల రక్షణ విషయంలో కమిషన్‌ నిస్పాక్షికంగా విచారణ జరుపుతుందని స్పష్టం చేశారు. టాయిలెట్‌లో రహస్య కెమెరాలపై తమకు సరైన ఆధారాలు తమకు లభించలేదని తెలిపారు. అయితే ఈ కేసుపై సమగ్ర విచారణ అవసరమని అభిప్రాయపడడ్డారు. మహిళా కమిషన్‌తోపాటు పోలీసులు కులం, మతం కోణంలో కాకుండా మహిళ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్‌సీడబ్ల్యూ మహిళల రక్షణకు కట్టుబడి ఉందన్నారు. ఈనెల 18న కర్నాటక కళాశాలలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఖుష్బు ఉడిపికి వచ్చారు.

అందరికీ ఒకేవిధమైన రక్షణ..
మహిళల రక్షణ విషయంలో జాతీయ మహిళా కమిషన్‌ ఒకేలా ఉంటుందని ఖుష్బు తెలిపారు. మతంతో సంబంధం లేకుండా రక్షణ కల్పించడంపై కమిషన్‌ దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ ఘటనను మతపరమైన కోణంలో చూడొద్దని ప్రజలను కోరారు.

ఏం జరిగిందంటే..
కర్ణాటకలోని ప్రైవేట్‌ పారామెడికల్‌ కాలేజీకి చెందిన ముగ్గురు ముస్లిం విద్యార్థినులు జూలై 18న స్నేహితుడిని రికార్డ్‌ చేయడానికి వాష్‌రూమ్‌లో ఫోన్‌ ఏర్పాటు చేశారు. హిందువు అయిన మరొక విద్యార్థిని రికార్డ్‌ చేశారు. ముగ్గురు విద్యార్థికి క్షమాపణలు చెప్పించారు. ఈ సంఘటనపై రాజకీయ వివాదం చెలరేగడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. తొలగించబడిన వీడియోలో కనిపించిన విద్యార్థి, తన స్నేహితులకు జరిగిన సంఘటన గురించి చెప్పింది. కళాశాల యాజమాన్యానికి కూడా ఫిర్యాదు అందింది. జూలై 19న కళాశాల యాజమాన్యం మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.

మతం రంగు పులుముకుని..
అయితే, ఈ కేసు మతపరమైన మలుపు తిరిగింది. సస్పెండ్‌ చేయబడిన విద్యార్థులు, కుట్రలో భాగంగా ముస్లిం పురుషుల మధ్య ప్రసారం చేయడానికి హిందూ బాలికల ప్రైవేట్‌ వీడియోలను చిత్రీకరించడానికి రహస్య కెమెరాలను ఉపయోగించారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయమై కళాశాల యాజమాన్యం జూలై 25న విలేకరుల సమావేశం నిర్వహించి వాస్తవాలను స్పష్టం చేసింది. ముగ్గురు విద్యార్థులు వీడియోను రూపొందించినట్లు అంగీకరించారని, తరువాత వారిని సస్పెండ్‌ చేశామని చెప్పారు.

బీజేపీ నిరసన.. కేంద్ర మంత్రి ఆగ్రహం..
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ బెంగళూరులోని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర నివాసం దగ్గర బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ మహిళా విభాగం బెంగళూరులోని ఫ్రీడమ్‌ పార్క్‌ వద్ద కూడా ధర్నా నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కూడా ఉడిపిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకవర్గాన్ని బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.

ఆధారాలే లేవు…
ఈ ఘటనపై చైర్‌పర్సన్‌ రేఖాశర్మ విచారణకు ఖుష్బును పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పరిశోధనలు కొనసాగుతున్నాయి, సమగ్ర విచారణ అవసరం. పోలీసులకు ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఖచ్చితమైన సాక్ష్యం దొరికే వరకు, ఛార్జిషీట్‌ దాఖలు చేయలేం’ అని పేర్కొన్నారు. ‘ఇది బ్రేకింగ్‌ న్యూస్‌ గురించి కాదు. ఇది విద్యార్థుల గురించి, మహిళల గురించి.. కాబట్టి మనం వేచి చూడాలి. మేము వేచి ఉండాలి’ అని పేర్కొన్నారు.

ఎన్‌సీడబ్ల్యూపై హోం మంత్రి అభ్యంతరం..
ఎన్‌సీడబ్ల్యూ మణిపూర్‌కు బృందాన్ని పంపలేదని, ఉడిపికి సభ్యుడిని పంపిందని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమేశ్వర కూడా గతంలో చేసిన ప్రకటనపై వివరణ ఇచ్చారు. ‘‘అమ్మాయిలు వీడియో రికార్డింగ్‌ చేయడం పిల్లల ఆట అని నేను చెప్పలేదు… స్నేహితుల మధ్య కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవి అక్కడే ముగుస్తాయి. కళాశాల ప్రిన్సిపాల్‌ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులను సస్పెండ్‌ చేశారు. మరిన్ని చర్యలను ప్రారంభించడం వారికి మిగిలి ఉంది మరియు మేము జోక్యం చేసుకోలేము’ అన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular