ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు రాజకీయాల్లో బిజీ అయిపోయారు పవన్ కల్యాణ్. అందుకే ఆయనకు ఇప్పటివరకు పార్ట్‌టైం పొలిటీషియన్‌గా పేరు వచ్చింది. అయితే.. నిన్న కృష్ణా జిల్లాలో పవన్ చేసిన పర్యటనకు ఊహించని మద్దతు లభించింది. దీంతో పేర్ని నాని, కొడాలి నాని గతంలో చేసిన ఈ వ్యాఖ్యలకు ఒక్కసారిగా సమాధానం దొరికినట్లుగా అయిపోయింది. అభిమానులు, స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించడంతో ఊహించిన విధంగా సాయంత్రానికి పవన్ కల్యాణ్ మీద సామాజిక వర్గానికి చెందిన నేతలతో వైసీపీ ప్రతి దాడి చేయించింది.
Also Read: రాజకీయాల్లోకి రాను.. రజినీకాంత్ సంచలన ప్రకటన.. కారణం ఇదే!
పవన్‌పై వైసీపీ నేత మంత్రి కురసాల కన్నబాబు విరుచుకుపడ్డారు. రైతులకు మేలు చేసే విషయంలో పవన్ కళ్యాణ్‌తో గానీ మరొకరితో కానీ చెప్పించుకునే పరిస్థితుల్లో తమ ప్రభుత్వం లేదని.. గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చిన రెండు మూడు సంవత్సరాల వరకు పరిహారం ఇవ్వలేదని చెబుతూ పరిహారం అందించడంలో తమ పార్టీ జాప్యాన్ని సమర్థించుకున్నారు.
ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమంలో ప్రభుత్వం బిజీగా ఉందని, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో ఒక పండుగ వలే జరుగుతోందని చెప్పుకొచ్చారు. జగన్‌కు మంచి పేరు వస్తుండడంతో దీన్ని డైవర్ట్ చేయడానికి పవన్ రైతుల పేరిట రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: రైతుబంధుకు ఖజానా కష్టాలు
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే నిజంగానే పవన్ కళ్యాణ్ అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమం చేస్తారా లేక ప్రకటనతో సరి పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయకుండానే వదిలేస్తారా అన్నది వేచి చూడాలి. అసలే.. జమిలి ఎన్నికలను టార్గెట్ చేసిన పార్టీలు.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి ఆందోళనలో పవన్ స్వయంగా దిగినట్లుగా తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్