https://oktelugu.com/

చరణ్ కి కరోనా అయినా.. ‘ఆర్ఆర్ఆర్’ ఆగట్లేదు !

రామ్ చరణ్ కి కరోనా రావడంతో మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. చరణ్ డేట్స్ మిస్ అవ్వడంతో ఇప్పుడు మిగిలిన ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం కాంబినేషన్ షాట్స్ ను ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. దాంతో సినిమాలోని మెయిన్ ఆర్టిస్ట్ లందరి డేట్స్ తీసుకుని షూట్ చేస్తుండగా చరణ్ కి కరోనా వచ్చిందట. దెబ్బకు ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. గండిపేట ప్రాంతంలో […]

Written By:
  • admin
  • , Updated On : December 29, 2020 / 01:17 PM IST
    Follow us on


    రామ్ చరణ్ కి కరోనా రావడంతో మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. చరణ్ డేట్స్ మిస్ అవ్వడంతో ఇప్పుడు మిగిలిన ఆర్టిస్ట్ ల డేట్స్ అన్ని క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం కాంబినేషన్ షాట్స్ ను ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. దాంతో సినిమాలోని మెయిన్ ఆర్టిస్ట్ లందరి డేట్స్ తీసుకుని షూట్ చేస్తుండగా చరణ్ కి కరోనా వచ్చిందట. దెబ్బకు ఆర్ఆర్ఆర్ షూట్ మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. గండిపేట ప్రాంతంలో వేసిన సెట్ లో ఎన్టీఆర్-చరణ్ లపై అనేక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది.

    Also Read: కలియుగ కర్ణుడికి మరో అరుదైన గౌరవం !

    ఇప్పుడు కనీసం రెండు వారాల పాటు చరణ్ షూట్ కు రాడు. పైగా చరణ్ తో సన్నిహితంగా ఉన్న ఎన్టీఆర్ కూడా షూట్ కి రాను అని చెప్పాడట. అయితే ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కి సంబందించి ఫిల్మ్ సర్కిల్స్ లో లేటెస్ట్ గా ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలుస్తోంది. రేపటి నుండి జరగబోయే షూట్ లో అజయ్ దేవగన్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడానికి రాజమౌళి ప్లాన్ చేయిస్తున్నాడని.. ఇప్పటికే అజయ్ కూడా రేపటి నుండి షూట్ లో పాల్గొనడానికి అంగీకరించాడని తెలుస్తోంది. అయితే మొదట ఈ సీన్స్ ను గోల్కండ కోటలో షూట్ చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేయాలనుకున్నారు.

    Also Read: మహేష్ బాబు కోసం నలుగురి మధ్య పోటీ !

    కానీ, ప్రస్తుతం గతంలో వేసిన సెట్స్ లోనే షూట్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశాడు. అన్నట్టు ఇవి ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కావడంతో.. సీన్స్ లో పిరంగలిలో పేల్చే షాట్స్ కూడా అంతే స్థాయిలో తీయాలని రాజమౌళి ఆ షాట్స్ ను మాత్రం గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి.. సిజీ వర్క్ చేయించడానికి రెడీ అవుతున్నాడట. ఏది ఏమైనా ఈ సినిమా పై రాజమౌళి మొదటినుండి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, సినిమాని త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్