Revanth Reddy Audio : కేటీఆర్ సంచలనం.. రేవంత్ రెడ్డి ఆడియో లీక్.. సారీ చెప్పిన పీసీసీ చీఫ్‌!

Revanth Reddy Audio : తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Telangana Working President KTR), తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) ను.. రేవంత్ ‘గాడిద’ అన్నారంటూ ప‌త్రిక‌లో వ‌చ్చిన న్యూస్ క్లిప్ ను కేటీఆర్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ర‌గ‌డ మొద‌లైంది. దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించ‌గా.. రేవంత్ మాట‌లు ఉన్న ఆడియో […]

Written By: Bhaskar, Updated On : September 17, 2021 1:03 pm
Follow us on

Revanth Reddy Audio : తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (Telangana Working President KTR), తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ (Shashi Tharoor) ను.. రేవంత్ ‘గాడిద’ అన్నారంటూ ప‌త్రిక‌లో వ‌చ్చిన న్యూస్ క్లిప్ ను కేటీఆర్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ర‌గ‌డ మొద‌లైంది. దీనిపై రేవంత్ ఘాటుగా స్పందించ‌గా.. రేవంత్ మాట‌లు ఉన్న ఆడియో క్లిప్ ను పోస్ట్ చేసి సంచ‌ల‌నానికి తెర‌తీశారు కేటీఆర్.

ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ శ‌శిథ‌రూర్ ఇటీవ‌ల‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఐటీలో తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. అయితే.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై రేవంత్ రెడ్డికి స‌మాచారం లేదు. అంతేకాకుండా.. టీఆర్ ఎస్ ను మెచ్చుకున్నారు. దీనిపై మీడియాప్ర‌శ్నించ‌గా.. ఆవేశానికి లోనైన రేవంత్ శ‌శిథ‌రూర్ ను గాడిద‌తో పోల్చారు. కేటీఆర్ ను కూడా విమ‌ర్శించారు.

దీనికి సంబంధించి ఇంగ్లీష్ ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఓ వార్త క్లిప్ ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు కేటీఆర్. అంతేకాదు.. రేవంత్ ను థ‌ర్డ్ రేట్ క్రిమిన‌ల్ అని, అలాంటి వ్య‌క్తికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఇలానే ఉంటుంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీంతో వివాదం మొద‌లైంది. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ అబ‌ద్దాలకోరు అని, ఆయ‌న మాట‌లు న‌మ్మొద్ద‌ని అన్నారు.

దీంతో.. రేవంత్ మాట్లాడిన‌ట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ ను కేటీఆర్ షేర్ చేశారు. దీనిపై రేవంత్ స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ వాయిస్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే.. నోటుకు ఓటు వాయిస్ తో మ్యాచ్ అవుతుంద‌ని అన్నారు. ఆ ఆడియో క్లిప్ లో రేవంత్ రెడ్డి శ‌శిథ‌రూర్ ను గాడిద‌తో పోలుస్తూ మాట్లాడిన‌ట్టుగా ఉంది. దీంతో.. ఈ విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఇక‌, ఇంత‌టితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని భావించిన రేవంత్ రెడ్డి.. శ‌శిథ‌రూర్ పై చేసిన వ్యాఖ్య‌ల‌కు చింతిస్తున్న‌ట్టు చెప్పారు. వాటిని వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని అన్నారు. ఈ మేర‌కు సోస‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘శశిథరూర్ తో ఫోన్లో మాట్లాడాను. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఉప‌సంహ‌రించుకుంటున్నా. శ‌శిథ‌రూర్ ను గౌర‌వించే వ్య‌క్తిని నేను. ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చాను. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్ విజ‌యానికి అంద‌ర‌మూ క‌లిసి కృషి చేస్తాం’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

ఆ త‌ర్వాత శ‌శిథ‌రూర్ కూడా ఈ అంశంపై ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. రేవంత్ రెడ్డి త‌న‌కు కాల్ చేసిన జ‌రిగిన దానికి చిస్తున్న‌ట్టు చెప్పార‌ని, క్ష‌మాప‌ణ‌ కూడా కోరార‌ని తెలిపారు. ఈ సంఘ‌ట‌న దుర‌దృష్ట‌వ‌శాత్తూ జ‌రిగింద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌తోపాటు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ బ‌లోపేతం కోసం క‌లిసి ప‌నిచేస్తామ‌ని ట్వీట్ చేశారు.