https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ వేదిక పై తమ ప్రేమ కథను తెలియ చేయనున్న చైతూ…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రస్. అలాంటి ఎమోషన్స్ లో అత్యంత ముఖ్యమైన ఎమోషన్ ప్రేమ. బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున మన్మధుడు సినిమా తో లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని టాలీవుడ్ కే మన్మధుడు అయ్యాడు. నేనేం తక్కువ తిన్నానా అంటూ తండ్రి బాటలో నడుస్తున్నాడు నాగచైతన్య. తన తండ్రి నాగర్జున కి మన్మధుడు లాగే నాగచైతన్యకి కూడా ప్రేమమ్ మూవీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 17, 2021 / 01:32 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్ని ఎమోషన్స్ కి కేరాఫ్ అడ్రస్. అలాంటి ఎమోషన్స్ లో అత్యంత ముఖ్యమైన ఎమోషన్ ప్రేమ. బిగ్ బాస్ షో హోస్ట్ నాగార్జున మన్మధుడు సినిమా తో లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని టాలీవుడ్ కే మన్మధుడు అయ్యాడు. నేనేం తక్కువ తిన్నానా అంటూ తండ్రి బాటలో నడుస్తున్నాడు నాగచైతన్య. తన తండ్రి నాగర్జున కి మన్మధుడు లాగే నాగచైతన్యకి కూడా ప్రేమమ్ మూవీ లవర్ బాయ్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది.

    నాగచైతన్య, సమంత జంటగా నటించిన “మజిలీ” మూవీ తర్వాత చైతూ ఎలాంటి లవ్ సినిమా చెయ్యలేదు. చాలా రోజుల తరువాత మళ్లీ ఇంకొక అధ్భుత మైన ప్రేమ కథ తో ముందుకు రానున్నాడు చైతు. ఇదిలా ఉండగా ఈ అధ్భుత మైన ప్రేమ కథ (లవ్ స్టోరీ) ను శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగచైతన్య సరసన పింపుల్స్ బ్యూటీ సాయి పల్లవి నటించనుంది.

    నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టడానికి “లవ్ స్టోరీ”(Love Story) మూవీ తో సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఎందరో హీరోస్, హీరోయిన్స్ బిగ్ బాస్ హౌస్ లో కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య, సాయి పల్లవి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వీకెండ్ స్పెషల్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నారని వినికిడి.