
తెలంగాణ మొన్నటి వరకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సీజన్ నడిచింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హవా కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో రెండు స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. అయితే.. ఇప్పటికే టీఆర్‌ఎస్ దుబ్బాక బై పోల్ ఓడిపోయింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్ట పోయిన చందంగా విజయం సాధించింది. కానీ.. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాల్సిన ఆవశ్యకత గులాబీ పార్టీపై ఎంతైనా ఉంది.
Also Read: వదిలేసిన జగన్.. షర్మిల పని అయిపోయినట్టేనా?
అందుకే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా ఈ భారం ఎమ్మెల్యేలపై వేశారు. కేటీఆర్‌కు టాస్క్ అప్పగించారు. కేటీఆర్ ఎమ్మెల్యేలను తరుముతున్నారు. గెలిపించుకుని రాకపోతే మీకు కష్టమేనని నేరుగా చెబుతున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. అక్కడ అభ్యర్థి పల్లా రాజశ్వేర్ రెడ్డి జోరుగానే ఉన్నారు. ఓటర్లను కలుస్తున్నారు. కానీ.. సమస్య అంతా రంగారెడ్డి పట్టభద్రుల నియోజవకవర్గంలోనే వస్తోంది. అక్కడ చివరి క్షణంలో పీవీ కుమార్తెను కేసీఆర్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆమెకు హైకమాండ్ ఎలాంటి ఆఫర్ ఇచ్చిందో కానీ.. ఆమె ప్రచారానికి రారని… ఎమ్మెల్యేలే బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ నేరుగానే లక్ష్యం నిర్దేశిస్తున్నారు.
Also Read: తెలంగాణలో 2023లో అధికారం ఎవరిదో తేలనుంది?
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నేతలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించారు. వాణీదేవి బయట తిరిగి ప్రచారం చేయలేరని అందుకే ప్రచార బాధ్యత మొత్తం ఎమ్మెల్యేలే తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సరైన ఫలితాలు తీసుకురాని సబితా ఇంద్రారెడ్డి, తలసాని, సుధీర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, ముఠాగోపాల్ లపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో చేసినట్లుగా చేస్తే ఈ సారి టిక్కెట్లు ఉండవని పరోక్ష సంకేతాలు పంపేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో టీఆర్ఎస్‌లో కొంత నైరాశ్యం నెలకొంది. గత ఎన్నికల్లోనూ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో చేదు అనుభావాలే ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో గెలిచి తీరాలన్న అనివార్యం టీఆర్ఎస్‌కు ఏర్పడింది. దాంతో చాలెంజ్‌గా తీసుకుని గెలిపించాల్సిన భారాన్ని నేతలందరికీ అప్పగించింది. అయితే.. అభ్యర్థి కూడా ప్రచారానికి రాకుండా ఎలా గెలిపించుకు రావాలన్నది ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ పీవీ కుమార్తె ఓడిపోతే రెండు రకాలుగా నష్టం జరుగుతుంది. పీవీని అవమానించారన్న విమర్శలు పెరుగుతాయి. అందుకే కేటీఆర్ ఎమ్మెల్యేలపై భారం వేయడమే కాదు.. తాను స్వయంగా రంగంలోకి దిగుతానంటున్నారు.