కోటిన్నర డబుల్ బెడ్ రూంలు.. ఘనత చాటిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదలపై భారం పడకుండా రూ.9 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని చెప్పారు. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఒక్కో బెడ్ రూమ్ విలువ రూ.1.50 కోట్లుగా ఉందన్నారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన 330 […]

Written By: Srinivas, Updated On : June 26, 2021 6:40 pm
Follow us on

హైదరాబాద్ నగరంలో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదలపై భారం పడకుండా రూ.9 వేల కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని చెప్పారు. హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఒక్కో బెడ్ రూమ్ విలువ రూ.1.50 కోట్లుగా ఉందన్నారు.

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ లోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సనత్ నియోజకవర్గంలో రూ.28.50 కోట్ల వ్యయంతో 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. అనంతరం అర్హులైన వారికి ఇళ్ల పత్రాలు అందజేశారు. అంబేద్కర్ నగర్ వాసుల కలలు నెరవేరేందుకు ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు. దేశంలోనే గొప్ప పథకంగా అభివర్ణించారు.

ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇళ్లతో పాటు 26 దుకాణాలు నిర్మించామన్నారు. వీటి ద్వారా వచ్చే అద్దెలతో భవనాలు, లిఫ్టుల నిర్వహణ చేపడతామని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. నగరాన్ని శుభ్రంగా ఉంచుకునే క్రమంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

డబుల్ బెడ్ రూమ్ ఇంటిని560 చదరపు అడుగుల్లో ఒక్కో యూనిట్ కు రూ.8 లక్షల 50 వేలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వెళ్లే క్రమంలో కాసేపు మాట్లాడారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కల కేసీఆర్ నెరవేర్చారని పేర్కొన్నారు.