నాన్ లోకల్ ప్రకాశ్ రాజ్ మంచిచేయగలడా?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో రాజకీయ పోరు షురూ అయింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ రచ్చ చేస్తోంది. నాన్ లోకల్ అనేది సమస్య కాదని బుకాయిస్తోంది. అయితే మెజార్టీ సభ్యులు మాత్రం ప్రకాశ్ రాజ్ తెలుగువాడు కాదనే వాదన తెస్తున్నారు. దీంతో ప్రకాశ్ రాజ్ తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ వెంట చిరంజీవి ఉన్నారనే ప్రచారం ఊపందుకోవడంతో అనూహ్యంగా నాన్ లోకల్ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నటులకు భాషా […]

Written By: Srinivas, Updated On : June 26, 2021 6:40 pm
Follow us on

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో రాజకీయ పోరు షురూ అయింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ రచ్చ చేస్తోంది. నాన్ లోకల్ అనేది సమస్య కాదని బుకాయిస్తోంది. అయితే మెజార్టీ సభ్యులు మాత్రం ప్రకాశ్ రాజ్ తెలుగువాడు కాదనే వాదన తెస్తున్నారు. దీంతో ప్రకాశ్ రాజ్ తీరుపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ వెంట చిరంజీవి ఉన్నారనే ప్రచారం ఊపందుకోవడంతో అనూహ్యంగా నాన్ లోకల్ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ నటులకు భాషా భేదం ఉండదని చెబుతున్నారు. తెలుగు నటులే లోకల్ అవుతారు. పరాయిభాష వారు నాన్ లోకలే అని తెగేసి చెబుతున్నారు. మా సమస్యలు తీరుస్తానని చెబుతున్న ప్రకాశ్ రాజ్ పరిశ్రమకు ఏ మాత్రం సేవ చేయగలడో అనే అనుమానాలు వస్తున్నాయి.

ప్రకాశ్ రాజ్ కు తెలంగాణలో ఫామ్ హౌస్ ఉంది. ఇక్కడ రెండు గ్రామాలను దత్తత తీసుకున్నందున నేను ఇక్కడి వాడినే అని ప్రతివాదన చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బెంగుళూరు నుంచి పోటీకి దిగారు. ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు నటులు ప్రశ్నిస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనేది తెలుగువారి సంఘం అని చెప్పుకొస్తున్నారు. అన్ని భాషల్లో నటిస్తూ అప్పుడప్పుడు తెలుగులో నటిస్తూ నేను ఇక్కడి వాడినే అంటే కుదరదని పేర్కొన్నారు.

కన్నడ నటీనటుల సంఘంలో పోటీ చేయగలరా అని అడుగుతున్నారు. నేను లోకల్ అని చెప్పుకునే ప్రకాశ్ రాజ్ రాజకీయంగా తన అస్థిత్వాన్ని ప్రదర్శించాలనుకుంటే కచ్చితంగా ఇక్కడి వాడే అయి ఉండాలని సూచిస్తున్నారు. ఏది ఇక్కడి వారిని వారి భాషలో నటించేందుకు అవకాశాలు కల్పించమని అడుగుతున్నారు. మన భాషలో ఇతరుల ప్రమేయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వడం సముచితం కాదనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది.

ప్రకాశ్ రాజ్ వ్యవహార శైలిపై ఇప్పటికే పలు వివాదాలు ఉన్నాయి. ఆయనకు సంకుచిత మనస్థత్వం ఉంటుందని అందరి వాదన. గతంలో చిరంజీవిని సైతం ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలున్నా ఎందుకో ఆయనకు మద్దతు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టాలీవుడ్ ఇక్కడి నటుల కోసం ఏర్పడిన సంస్థ అని పరాయి వారిని ఒప్పుకోమని తెగేసి చెబుతున్నారు. దీంతో ప్రకాశ్ రాజ్ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో వేచి చూడాల్సిందే.