KTR Story On Modi: కేంద్రం పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై రూ.8లు, డీజిల్ పై రూ.6 లు, సిలిండర్ పై రూ. 200 తగ్గించింది. దీంతో ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ధరలు పెంచడం వారి ఇష్టానుసారమే తగ్గించడం మాత్రం ఏదో ఉపశమనంగా చేసి తమ ఘనతగా చెప్పుకుంటున్నాయని సెటైర్లు వేస్తున్నాయి. తగ్గించిన ధరలతో సామాన్యుడికి ఊరట కలిగించిందని చెబుతున్నా అందులో వాస్తవం లేదని పెదవి విరుస్తున్నాయి. విపరీతంగా పెంచి కొద్దిగా తగ్గించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాక ముందు ధరలు తగ్గినా తరువాత మాత్రం ఎందుకు పెరిగాయని ప్రశ్నిస్తున్నారు. పన్నుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచేసి సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు పెంచారో తెలుసా అని మండిపడుతున్నారు. అలా పెంచిన ధరలను ఏదో కంటితుడుపు చర్యగా తగ్గించి తామేదో గొప్పలు చేశామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని వాపోతున్నారు.
దీనికి ఓ పిట్టకథ కూడా చెప్పారు. పాఠశాల పక్కన ఉండే ఓ దుకాణదారుడు పీక్ సీజన్ లో ధరలను ఏకంగా 300 శాతం పెంచాడు. తరువాత దాన్ని 30 శాతం తగ్గించాడు. దీనికి దుకాణదారుడి ఆఫర్ ను బంపర్ ఆఫర్ గా అతడి సన్నిహితులు అభివర్ణించారు. అసలు ధరలు ఎవరు పెంచారు? ఎంత తగ్గించారు? అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న జిమ్మిక్కులు ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పారు.

పెట్రో ధరల తగ్గింపుపై కేంద్రం, రాష్ట్రం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం కేవలం ఊరడింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. పెట్రోల్ పై దేశంలోనే తెలంగాణ ఎక్కువ పన్నులు వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న పెట్రో ధరల తగ్గింపుపై మొత్తానికి పెద్ద దుమారమే రేగుతోంది. బీజేపీ నేతలు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంటే టీఆర్ఎస్ మాత్రం కేంద్రం పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. మొత్తానికి పెట్రో ధరల తగ్గింపు వ్యవహారం ఎక్కడకు వెళ్తుందో తెలియడం లేదు.
Also Read: Secret Behind Rajya Sabha Ticket: హే కృష్ణా.. రాజ్యసభ టికెట్ వెనుక అంత రహస్యం ఉందా!?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s
[…] Also Read: KTR Story On Modi: మోడీ చిలక్కొట్టుడుపై కేటీఆర్ … […]