Russia Ukrain War: ప్రపంచంలో ఎన్నో సంక్షోభాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ సంక్షోభ సమయాల్లో మదుపు చేయడానికి అందరు భయపడుతుంటారు. లాభాలు వస్తాయో లేదో అనే సందేహంలో తమ వాటాలు తగ్గించుకుంటారు. ఆర్థిక నిపుణులు మాత్రం ఇలాంటి సమయాల్లోనే మదుపు చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ధైర్యం కోల్పోకుండా నిలబడి మంచి స్టాక్స్ లలో మదుపు చేసుకుంటే ఎలాంటి నష్టమూ ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో మార్కెట్లు డీలా పడుతున్నాయి. భవిష్యత్ పై భయంతో ఎవరు కూడా మదుపు చేయడానికి ఉత్సాహం చూపడం లేదు. దీంతో ఒడిదుడుకుల ధోరణిలోకి వెళ్లాయి.

అన్ని రంగాలపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. యుద్ధంతో వ్యాపారాలు ముందుకు సాగవు. ముడిసరుకుల కొరత కూడా వస్తుంది. దీంతో ఉత్పత్తి తగ్గిపోయి డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈనేపథ్యంలో ధరలు కూడా పడిపోతాయి. ఈక్విటీ షేర్ల ధరలు 10-30 శాతం మేర పడిపోవడంతో మార్కెట్లు నష్టాల బాటలోనే పయనిస్తాయి. కానీ కొంచెం శ్రద్ధ తీసుకుంటే సంక్షోభ సమయంలో కూడా మదుపు చేయడానికి అనువైన పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు.
Also Read: Secret Behind Rajya Sabha Ticket: హే కృష్ణా.. రాజ్యసభ టికెట్ వెనుక అంత రహస్యం ఉందా!?
సంపదను పెంచుకోవడానికి సంక్షోభాలే ఊతమిస్తున్నాయని తెలుస్తోంది. దానికి చరిత్ర కూడా ఇదే విషయం సూచిస్తోంది. సంక్షోభ సమయంలో బంగారం, టెక్నాలజీ, యుటిలిటీస్ వంటి వాటిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో నష్టమే కాని లాభం ఉండదు. సంక్షోభ సమయంలో మార్కెట్లు కుంగినా షేర్ల ధరలు మాత్రం అందుబాటులో ఉండటం తెలిసిందే.

సంక్షోభ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మామూలే. బియ్యం, పాలు, సబ్బులు, ఔషధాలు, పప్పులు వంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే వీటిపై పెట్టుబడులు పెడితే లాభాలు రావడం సహజమే. ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, ఎంటర్ టైన్ మెంట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వంటి వాటిని పట్టించుకోకపోవడమే ఉత్తమం.
సంక్షోభ సమయంలో మార్కెట్లు తమ వాటా పెంచుకోవాలని చూస్తాయి. కరోనా సమయంలో కూడా చాలా కంపెనీలు ఇలాగే చేసినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం రావడంతో మార్కెట్లు చాలా వరకు కుదేలయ్యాయి. ఇలాంటి సమయంలోనే సంపదను వృద్ధి చేసుకోవడానికి మార్గాలు అందుబాటులో ఉన్నట్లు గ్రహిస్తే లాభాలు సాధించడం అంత కష్టమేమీ కాదని చెబుతున్నారు.
Also Read: Ego War Between YCP Leaders: వైసీపీ కీలక నేతల మధ్య ఇగో వార్..అసలు ట్విస్ట్ అదేనా?
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s