https://oktelugu.com/

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ‘ఉక్కు’ మంత్రం

ఏపీలో అట్టుడుకుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం తెలంగాణలోనూ తన సెగను రాజేస్తోంది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో సైతం ఉక్కు ఉద్యమం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన కేటీఆర్ అవసరం అయితే విశాఖ వస్తానని ప్రకటించేశారు. ఈ విషయాన్ని ఏపీ రాజకీయ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు.. కానీ.. ఇతర తెలంగాణ పార్టీలు మాత్రం కేటీఆర్ పై ఫైరయిపోతున్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ పూర్తిగా లైట్ తీసుకుంది. ప్రయివేటీకరణ ఆ పార్టీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 12:24 PM IST
    Follow us on


    ఏపీలో అట్టుడుకుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం తెలంగాణలోనూ తన సెగను రాజేస్తోంది. ఏపీలోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లో సైతం ఉక్కు ఉద్యమం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికిన కేటీఆర్ అవసరం అయితే విశాఖ వస్తానని ప్రకటించేశారు. ఈ విషయాన్ని ఏపీ రాజకీయ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదు.. కానీ.. ఇతర తెలంగాణ పార్టీలు మాత్రం కేటీఆర్ పై ఫైరయిపోతున్నాయి. అయితే ఈ అంశాన్ని బీజేపీ పూర్తిగా లైట్ తీసుకుంది. ప్రయివేటీకరణ ఆ పార్టీ విధానం కాబట్టి.. ఎవరు ఏమన్నా.. స్పందించదు. కాంగ్రెస్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటోంది.

    Also Read: తెలంగాణ‌లో ష‌ర్మిల దూకుడు.. పార్టీ పెట్ట‌కుండానే పదవుల పంప‌కం!

    సెటిలర్ల ఓట్లకోసమే కొత్తగా కేటీఆర్ ఈ ప్రకటన చేశారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. విశాఖ ఉక్కు పోరాటానికి కేటీఆర్ మద్దతు వెనక దురుద్దేశం ఉందని కాంగ్రెస్ నేతలు అప్పుడే కౌంటర్లు వేయడం ప్రారంభించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సెటిలర్ల ఓట్లకోసమే.. టీఆర్ఎస్ సరికొత్త ఎత్తుగడ వేసిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీపై గల్లీలో టీఆర్ఎస్ చెప్పే మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన ఉండడం లేదని మండిపడ్డారు.

    నిజాం షుగర్ ఫ్యాక్టరీపై మాట్లాడని టీఆర్ఎస్ నేతలు విశాఖ ఉక్కు మీద ఉద్యమం చేస్తామని అంటుంటే.. సీమాంధ్రులు నమ్మరని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ గ్రౌండ్ లో చర్చంతా విశాఖ ఉక్కు పోరాడం మీదనే సాగుతోంది. నిజానికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రా జపం చేస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా ప్రకటన చేశారు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు ఉద్యమం సీజన్ సాగుతోంది. కాబట్టి.. స్టీల్ ప్లాంటు ఉద్యమానికి మద్దతు తెలిపారన్న విశ్లేషణలు ఉన్నాయి.

    Also Read: మోడీ బాటలో కేసీఆర్.. 75 ఏళ్ల స్వాతంత్య్ర పండుగకు పెద్దపీట

    గతంలో ప్రత్యేక హోదా గురించి కూడా అంతే చెప్పారు.కానీ ఒక్కసారి కూడా ఎన్నికల తరువాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడా తమ డిమాండ్ ను వెల్లడించలేదు. ఇప్పుడు స్టీల్ ప్లాంటు మద్దతు కూడా అంతేనని… రేపు బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ఎన్నికలు పూర్తయ్యాక.. రైతు చట్టాలకు మద్దతు ప్రకటించినట్లుగానే స్టీల్ ప్లాంటు అమ్మకానికి మద్దతు ప్రకటించినా ఆశ్చర్యం అవసరం లేదన్న అభిప్రాయాన్ని తెలంగాణ విపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్