https://oktelugu.com/

ప్రపంచం చూపు.. క్వాడ్ వైపు

క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగుదేశాల అధినేతలు పాల్గొంటున్నారు. మార్చి 12న(నేడు)జరిగే వర్చువల్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని సుగా, ఆస్ర్టేలియా ప్రధాని మోరిసన్ పాల్గొంటున్నారు. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలన్ని విదేశాంగ శాఖ మంత్రుల స్థాయిల్లోనే జరిగాయి. తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఈ సమావేశం ఇప్పుడు ప్రధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి జో బైడెన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2021 / 12:44 PM IST
    Follow us on


    క్వాడ్(క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్) కూటమి సదస్సులో తొలిసారిగా నాలుగుదేశాల అధినేతలు పాల్గొంటున్నారు. మార్చి 12న(నేడు)జరిగే వర్చువల్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని సుగా, ఆస్ర్టేలియా ప్రధాని మోరిసన్ పాల్గొంటున్నారు. ఇప్పటివరకు క్వాడ్ సమావేశాలన్ని విదేశాంగ శాఖ మంత్రుల స్థాయిల్లోనే జరిగాయి. తొలిసారి నలుగురు దేశాధినేతలు ఇందులో పాల్గొంటున్నారు. దీంతో ఈ సమావేశం ఇప్పుడు ప్రధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి జో బైడెన్ పాల్గొంటున్న బహుపాక్షిక తొలి సమావేశం కూడా ఇదే.. ఈ నేపథ్యంలో క్వాడ్ కూటమి ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని అన్నిదేశాలు ఆసక్తిగా ఉన్నాయి.

    Also Read: మోడీ బాటలో కేసీఆర్.. 75 ఏళ్ల స్వాతంత్య్ర పండుగకు పెద్దపీట

    ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు.. ఇండో..ఫసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, నేవిగేషన్, స్వేచ్ఛ, కోవిడ్ 19, టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు, మెరీటైమ్ సెక్యూరిటీ, పర్యవరణ మార్పులు తదితర అంశాలపై తాజా క్వాడ్ సదస్సులో చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ సామర్థ్యం పెంపుకోసం క్వాడ్ దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తయారీ విషయంలో చైనా దౌత్యానికి చెక్ పెట్టేందుకు భారత్ లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేలా ఆర్థిక సాయం చేసే అవకాశం కూడా ఉంది.

    ఈ సదస్సులో భారత్ ను ‘ఫార్మసీ ఆఫ్ వరల్డ్’గా ప్రధాని మోదీ హైలెట్ చేసే అవకాశం ఉంది. భారత్ లో వ్యాక్సిన్ తయారీ.. ఇప్పటి వరకు 67 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతిపై ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తయారీ విషయంలో క్వాడ్ దేశాల పరస్పర సహకారాల గురించి ఆయన మాట్లాడతారు. అమెరికాలో వ్యాక్సిన్ అభివృద్ధి, భారత్ లో తయారీ, జపాన్ ఆర్థిక సాయం, ఆస్ర్టేలియా మద్దతు ఇలా.. క్వాడ్ దేశాలు కోవిడ్ 19 విషయంలో అవలంబిస్తున్న అంశాలను ప్రపంచానికి వివరించాలని అనుకుంటున్నారు. మార్చి 9న ఇదే విషయమై ప్రధాని మోదీ జపాన్ ప్రధాని సుగాతో ఫోన్లో దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు.

    Also Read: ట్రంపు.. కంపు.. అమెరికా అత్యంత చెత్త అధ్యక్షుడు ఇతడేనంటా…

    క్వాడ్ ఏర్పాటుకు 2004లోనే బీజం పడింది. 2007లో అది కార్యరూపం దాల్చింది. మెరిటైం సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, మానవతా దృక్పథతో సమస్యలను పరిష్కరించుకోవడం, విపత్తు ఉపశమన చర్యలు వంటి అంశాలపై పరస్పర సహకారాల కోసం నాలుగు దేశాలు క్వాడ్ గా ఏర్పడ్డాయి. 2008లో చైనా ఒత్తిడి కారణంగా ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. తరువాత మళ్లీ కూటమిలో చేరింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు ఈ క్వాడ్ కూటమి మింగుడు పడడం లేదు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు