Ukraine- Russia Conflict- India: ఉక్రెయిన్ విషయంలో అన్ని దేశాలు భారత్ కు ఏవో సలహాలు ఇవ్వాలనే చూస్తున్నాయి. మన విదేశాంగ విధానం మనకు ఉంది. మన ఉద్దేశాల ప్రకారం మనం నడుచుకుంటాం. అంతేకాని ఎవరో చెప్పారని మన విధానాలు మార్చుకోం కదా. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి భారత్ అడ్డు చెప్పాలని అమెరికా సహా అన్ని దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. అది ఆ రెండు దేశాలు తేల్చుకోవాలి. మనమేం చేస్తాం. అది వారి వ్యక్తిగత విషయాలు. వారే పరిష్కరించుకోవాలి. దానికి మనదేశం ఏం చేస్తుంది. మనం చెబితే వారు యుద్ధాన్ని ఆపేస్తారా?
ఈ నేపథ్యంలో రష్యా చేస్తున్న దండయాత్రపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభల్లో పలు తీర్మానాలు చేశారు. ఓటింగ్ కు మాత్రం భారత్ దూరంగా ఉంది. దీంతో పలు దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఇండియా వైఖరిని తప్పుబడుతున్నాయి. అది మన అంతర్గత విషయం. అందులో వారి ప్రమేయం ఏంటని మనదేశం కూడా స్పందిస్తోంది. ఇటీవల యూకేలో నెదర్లాండ్స్ రాయబారి కావెల్ వాక్ ఓస్టెరోమ్ దీనిపై స్పందిస్తూ ఓటింగ్ కు దూరంగా ఉండటం సబబుకాదని ట్వీట్ చేశారు.
Also Read: Russia Ukraine Crisis: రష్యా దూకుడును తగ్గించుకుంటుందా?
దీంతో భద్రతా మండలిలో జరిగిన సాధారణ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి దీనికి కౌంటర్ ఇచ్చారు. భారత్ కు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు. అది మా వ్యవహారం. మాకు ఎలా వ్యవహరించాలో తెలుసు అంతేకాని ఎవరో చెబితే వినే స్థాయిలో లేం అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో సదరు రాయబారి చేసిన ట్వీట్ ను తొలగించారు.
ఇండియా లాంటి పెద్ద దేశం చేస్తున్న దానికి ఏదో విధంగా ఇరుకున పెట్టాలని చూస్తే ఇలాగే ఉంటుంది. మన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలకు ఏం పని. మన విధానం మనది. వారి ఉద్దేశాలు వారివి. అంతేకాని మనం చెబితే నెదర్లాండ్స్ వింటుందా? మన చెప్పుచేతల్లో ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా ఉచిత సలహాలు ఇచ్చే బదులు మన ఇంటిని బాగా చూసుకోవాలని చురకలంటించారు. దీంతో ఇక భారత్ జోలికి ఏ దేశం రాదనే అభిప్రాయాలు వస్తున్నాయి.