Homeజాతీయ వార్తలుKTR Vs Bhatti Vikramarka: నిండు సభలో నీళ్లతో కొట్టిన కేటీఆర్.. నీళ్లు నమిలిన భట్టి

KTR Vs Bhatti Vikramarka: నిండు సభలో నీళ్లతో కొట్టిన కేటీఆర్.. నీళ్లు నమిలిన భట్టి

KTR Vs Bhatti Vikramarka: తమలపాకుతో నేను ఒకటి ఒకటి ఇస్తే.. తలుపు చెక్కతో నేను రెండు ఇస్తా.. ఈ సామెత తీరుగానే సాగిపోయింది అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మధ్య వ్యవహారం. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య సయోధ్య ఉంది అనేది రాజకీయ వర్గాల్లో టాక్. పైగా భారత రాష్ట్ర సమితి కీలక నాయకులకు భట్టి విక్రమార్క మంచి స్నేహితుడు అనే టాక్ కూడా ఉంది. ఆమధ్య ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు అందర్నీ హౌస్ అరెస్టు చేయించాడు. అదే విక్రమార్కను మాత్రం దగ్గరికి తీసుకున్నాడు. చెవి
లో ఏదో గుసగుస చెప్పాడు. ఆ మధ్య రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ఒక కూటమిని కట్టడంలో భట్టి ఇక పాత్ర పోషించాడు అని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. అయితే అలాంటి భట్టి విక్రమార్క, కేటీఆర్ తో గెలుక్కున్నాడు. చివరికి నిండు సభలో నీళ్ల పాలయ్యాడు.

సాధారణంగానే కేటీఆర్ మంచి మాటకారి. తనదైన రోజు వస్తే చెడుగుడు ఆడుకుంటాడు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కదా. ఈ సమావేశాల్లో హైదరాబాదులో సరిగా నీళ్లు రావడం లేదు? నిండు వాన కాలంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా? ఏమోయ్ కేటీఆర్ ఇదేనా నువ్వు చెబుతున్న విశ్వనగరం? అంటూ భట్టి విక్రమార్క విమర్శలు చేశాడు. అంతేకాదు హైదరాబాదు చిన్న వర్షానికి మునిగిపోతోంది అంటూ అధికార పార్టీని కౌంటర్ చేశాడు. అప్పటికే హౌస్ లో ఉన్న కేటీఆర్ విక్రమార్క చెప్పిన ప్రతి విమర్శను నోట్ చేసుకున్నాడు. అతడు ఏ ఏ అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడో సోదాహరణంగా విన్నాడు. ఇక భట్టి మాట్లాడిన అనంతరం కౌంటర్ ప్రారంభించాడు.

వాస్తవానికి భట్టి విక్రమార్క బంజారాహిల్స్ ప్రాంతంలో ఉంటున్నాడు. అతడు ఉంటున్న ఇల్లు ఓ వ్యక్తికి సంబంధించింది. ఆ ఇంట్లో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి ఇచ్చే పంపు కు సంబంధించి మీటర్ మరమ్మతులకు గురైంది. అప్పటినుంచి విక్రమార్క దానికి ఎటువంటి బాగోగులు చేయించలేదు. కనీసం వారు ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదు. కానీ జలమండలికి సక్రమంగానే బిల్లులు చెల్లిస్తున్నారు. సరిగా ఇదే విషయాన్ని కేటీఆర్ సభ దృష్టికి తీసుకువచ్చారు. బిల్లులతో సహా భట్టి విక్రమార్కను కడిగిపారేశారు. దీంతో నీళ్లు నమ్మడం అతడి వంట అయింది. కనీసం కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా విక్రమార్కకు అవకాశం లేకుండా పోయింది. ఇదే అదునుగా కేటీఆర్ మరింత రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒక ఆట ఆడుకున్నారు. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెట్టి ఎవరినీ వదిలిపెట్టలేదు. ఇదే సమయంలో హైదరాబాదులో మురుగునీరు వస్తోంది. కొన్నిచోట్ల సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. ఇవాల్టికి జలమండలి విద్యుత్ సరఫరాకు సంబంధించి సరైన మరమ్మతులు చేపట్టడం లేదు. ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడంలో విక్రమార్క ఫెయిల్ అయ్యారో లేకుంటే వ్యూహాత్మకంగా మౌనం పాటించారో తెలియలేదు. కానీ చేజేతులా భారత రాష్ట్ర సమితికి హౌస్ లో అప్పర్హ్యాండ్ ఇచ్చారు. మరి ఇదే సాంప్రదాయాన్ని 2023 ఎన్నికల్లో కొనసాగిస్తారా అనేది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular