KTR : కేటీఆర్ ను ఉచ్చులోకి లాగుతున్న బండి సంజయ్, రేవంత్?

KTR : తెలంగాణ ప్రభుత్వంలో యంగ్ అండ్ డైనమిక్ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ ను ప్రతిపక్షాలు ముగ్గులోకి లాగుతున్నాయి. ఘాటు విమర్శలతో కేటీఆర్ ను కార్నర్ చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజేసిన ఈ డ్రగ్స్ మంటలు.. ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలతో మరింతగా అంటున్నాయి. అయితే ప్రతిపక్షాల ఉచ్చులో పడిపోయి ఈ విమర్శలకు కేటీఆర్ కౌంటర్లు ఇస్తూ సవాళ్లకు ఎదురునిలుస్తున్నారు. దీంతో ఉచ్చులో పడిపోతున్నారన్న […]

Written By: NARESH, Updated On : September 20, 2021 3:59 pm
Follow us on

KTR : తెలంగాణ ప్రభుత్వంలో యంగ్ అండ్ డైనమిక్ మంత్రి, సీఎం కుమారుడు కేటీఆర్ ను ప్రతిపక్షాలు ముగ్గులోకి లాగుతున్నాయి. ఘాటు విమర్శలతో కేటీఆర్ ను కార్నర్ చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాజేసిన ఈ డ్రగ్స్ మంటలు.. ఇప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలతో మరింతగా అంటున్నాయి. అయితే ప్రతిపక్షాల ఉచ్చులో పడిపోయి ఈ విమర్శలకు కేటీఆర్ కౌంటర్లు ఇస్తూ సవాళ్లకు ఎదురునిలుస్తున్నారు. దీంతో ఉచ్చులో పడిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక స్పందించకుంటే ఆరోపణలు నిజమని అనుకునే ప్రమాదం ఉండడంతో కేటీఆర్ ప్రతిపక్ష నేతల సవాల్ స్వీకరిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ కు డ్రగ్స్ పరీక్షలు చేయాలని.. ఖచ్చితంగా బయటపడుతుందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే చేయిస్తామన్నారు.

ఇక తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ‘వైట్ చాలెంజ్’ విసిరారు. ఉస్మానియా ఆస్పత్రికి వెళదామని.. డ్రగ్స్ పరీక్షల కోసం వైద్యులకు నమూనాలు ఇద్దామని  ఏకంగా కేటీఆర్ కు, మాజీ కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ చేశారు. ఇప్పుడు రేవంత్ విసిరిన సవాల్ సంచలనమైంది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వైట్ చాలెంజ్ ను స్వీకరించారు.

‘తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా.. కాంగ్రెస్ తరుఫున రాహుల్ గాంధీ సిద్ధమేనా? రాహుల్ ఒప్పుకుంటే ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షలకు సిద్ధం. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్ చిట్ వస్తే రేవంత్ క్షమాపణలు చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.

ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కు స్పందించారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు రానున్నట్టు తెలిపారు.

కాగా నీతి నిజాయితీలతో అందరికీ అందుబాటులో ఉంటూ .. అడిగిన వారికి సాయం చేసే కేటీఆర్ పై నీట్ ఇమేజ్ ను పోగొట్టడమే ధ్యేయంగా ప్రతిపక్ష నేతలు కార్నర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి కేటీఆర్ ఓవర్ గా రియాక్ట్ అవుతో వారి ఉచ్చులో పడిపోతున్నట్టుగా తెలుస్తోంది.

కాబోయే సీఎంగా కేటీఆర్ పేరు అందరినోట మారుమోగుతోంది. జాతీయ స్థాయిలో కేటీఆర్ ఇప్పుడు తెలంగాణ సీఎం తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నారు. తెలంగాణకు నంబర్ 2. భవిష్యత్ నేత..ఇప్పుడు ఆయనపై మరకలు అంటితే కడుక్కోవడం కష్టం. ఇప్పుడు ప్రతిపక్షాలుగా బండిసంజయ్, రేవంత్ రెడ్డిలు చేస్తున్నది అదే.. కేటీఆర్ తమకు సీఎం ప్రత్యర్థి అని వారిద్దరూ భావిస్తుండడంతో  ఆయనను పలుచన చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే దానికి రియాక్ట్ అవుతూ కేటీఆర్ వారి విమర్శలకు బదులివ్వడం కూడా మైనస్ అవుతోందని అంటున్నారు. మొత్తంగా ఈ డ్రగ్స్ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.