https://oktelugu.com/

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం

టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన కోహ్లీ.. అలాంటి అనూహ్య నిర్ణయమే మరొకటి తీసుకున్నాడు. 14వ సీజన్ ఐపీఎల్ ముగిశాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేసినట్లు కూడా వెల్లడించాడు. ఈ మేరకు విరాట్ మాట్లాడిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 20, 2021 / 10:47 AM IST
    Follow us on

    టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన కోహ్లీ.. అలాంటి అనూహ్య నిర్ణయమే మరొకటి తీసుకున్నాడు. 14వ సీజన్ ఐపీఎల్ ముగిశాక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథ్యం నుంచి కూడా తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేసినట్లు కూడా వెల్లడించాడు.

    ఈ మేరకు విరాట్ మాట్లాడిన వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ ఏమన్నాడంటే. ఆర్సీబీ ఫ్యామిలీ, ఏళ్లుగా బెంగళూరు జట్టుకు అండగా నిలుస్తున్న అద్భుతమై ఫ్యాన్స్ కు ఓ విషయం చెప్పుతున్నా. కెప్టెన్ గా ఇది నా ఆఖరి ఐపీఎల్. సారథ్యం నుంచి తప్పుకోవాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యానికి సైతం తెలియజేశా. ప్రపంచ కప్ తర్వాత భారత టీ20 జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్ల ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలుసు. వర్క్ లోడ్ ను తగ్గించుకొని, పునరుత్తేజం పొందడం ద్వారా కొత్త శక్తితో ఎలా ముందుకు సాగాలో నిర్ణయించుకున్నా. వచ్చే ఏడాది భారీ స్థాయిలో వేలం జరగనుండడంతో ఆర్సీబీ జట్టు పరివర్తన దిశగా సాగనుంది. కెప్టెన్ గా జట్టుతో నా తొమ్మిదేళ్ల పయనం అద్భుతంగా సాగింది. ఈ క్రమంలో నాకు మద్దతుగా నిలిచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కొన్ని సంవత్సరాల మాదిరే భవిష్యత్తులో ఈ జట్టుతో నా అనుబంధం కొనసాగుతుంది అని చెప్పాడు.