ఇంటిపోరుతో సతమతమవుతున్న మంత్రి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేసీఆర్ క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని అందరికీ తెల్సిందే.. దీంతో అప్పట్లో టీఆర్ఎస్ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రెండోసారి కూడా బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈసారి ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లోకి ఇద్దరు మంత్రులను తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరిన సబితా రెడ్డికి అనుహ్యంగా మంత్రి పదవీ దక్కింది. […]

Written By: Neelambaram, Updated On : August 13, 2020 8:21 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేసీఆర్ క్యాబినెట్లో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని అందరికీ తెల్సిందే.. దీంతో అప్పట్లో టీఆర్ఎస్ సర్కార్ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రెండోసారి కూడా బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. ఈసారి ప్రభుత్వంపై విమర్శలు రాకుండా సీఎం కేసీఆర్ తన క్యాబినెట్లోకి ఇద్దరు మంత్రులను తీసుకున్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేరిన సబితా రెడ్డికి అనుహ్యంగా మంత్రి పదవీ దక్కింది.

Also Read: చదువులా.. ప్రాణాలా? ఇప్పుడు ఏది ముఖ్యం?

దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. ఇక సీఎం కేసీఆర్ క్యాబినెట్లోనూ విద్యాశాఖ మంత్రిగా సబితారెడ్డి ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవీ దక్కించుకున్నప్పటికీ సబితా ఇంద్రారెడ్డికి ఇంటిపోరు.. పార్టీ పోరుతో మనశ్శాంతి కరువైందనే టాక్ విన్పిస్తోంది. ఓవైపు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి.. మరోవైపు పార్టీలో ఆధిపత్య పోరుతో తాను ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒక్కరికే అవకాశం అని సూచించడంతో ఆ ఎన్నికల్లో సబితా పోటీ చేయలేదు. ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి ఆ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా పోటీచేసి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. అయితే నాటి నుంచి ఆమె కాంగ్రెస్ లో ఉంటూనే సైలంటయ్యారు. ఒకనొక సమయంలో ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారనే టాక్ విన్పించింది. అయితే అనుహ్యంగా టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవీ దక్కించుకున్నారు.

అయితే ఆమె కుమారుడికి ప్రభుత్వంలో ఎలాంటి నామినేటేడ్ పదవీ లేకపోవడంతో ఆమెను ఒత్తిడి తెస్తున్నాడట. తన కుమారుడి భవిష్యత్ కోసం సబితా టీఆర్ఎస్ లో చేరినా తనయుడి ఎలాంటి పదవీ లేకపోవడంతో ఆలోచనలో పడ్డారట. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో నామినేటేడ్ పదవీనైనా కట్టబెట్టాలని చూస్తున్నారట. అయితే టీఆర్ఎస్ ఇంకా నామినేటేడ్ పదవుల భర్తీ చేయకపోవడంతో ఆమెపై ఇంటి నుంచి ఒత్తిడులు పెరుగుతున్నాయట. మంత్రిగా జిల్లాలో సత్తా చాటుతుండంతో జిల్లాలోని తన మేనల్లుళ్లు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు తనను శత్రువులా చూస్తున్నారట.

Also Read: జగన్ పని అయిపోయినట్లే… బాబు కి ఛాన్స్ ఇచ్చేశాడు మరి!

ఇక తన తమ్ముడు నరసింహారెడ్డికి కూడా టీఆర్ఎస్ లో ఎలాంటి పదవీ లేదు. 2009లో జెడ్పీటీసీగా ఓడినప్పటికీ నుంచి తాను సబితా ఇంద్రారెడ్డి వెంటే ఉంటున్నాడు. తనకు ఏదైనా పదవీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. ఇక జిల్లా నుంచి మంత్రి పదవీ ఆశించిన నేతలంతా ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఆమెపై ఇంటా, బయట ఒత్తిడులు అధికమవుతున్నాయట.

త్వరలోనే టీఆర్ఎస్ నామినేటేడ్ పదవుల భర్తీ చేస్తే తనకు కొంత ఉపశమనం లభిస్తుందని సన్నిహితులతో వాపోతున్నారు. దీంతో ఆమెకు నామినేటేడ్ పోస్టు భర్తీ తర్వాతనైన ఉపశమనం లభిస్తుందా? లేదో వేచి చూడాల్సిందే..!