KTR Dance : కేటీఆర్ డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో

అయితే ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించిన టీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలు,

Written By: NARESH, Updated On : November 6, 2023 9:51 pm
Follow us on

KTR Dance : సాధారణంగా రాజకీయ నేతలు సీరియస్ గా ఉంటారు. సినిమా వాళ్లు జోవియల్ గా ఉంటారు. రాజకీయ నేతలు డ్యాన్సులు ఆడడం చాలా అరుదు. మన మంత్రి మల్లారెడ్డి లాంటి నేతలు మాత్రం సినిమా వాళ్లకు మించి కామెడీ పంచుతుంటారు. మిగతా నేతలందరూ డ్యాన్సులు, డైలాగులు చెప్పడం చాలా కష్టమే.

అయితే ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించిన టీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలు, నేతల ఒత్తిడి మేరకు ఇటీవల ఫేమస్ అయిన ‘దేఖ్ లేంగే’ పాటకు డ్యాన్స్ చేశారు.

ఎప్పుడూ కేటీఆర్ పాదం కలపడం మనం చూసి ఉండము. కానీ తొలిసారి కేటీఆర్ ఎన్నికల జోష్ లో నేతలతో కలిసి ఆడిపాడారు. దేఖ్ లేంటే అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్లో మంచి స్టెప్పులు వేస్తూ అలరించారు. కేటీఆర్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.