Rashi Phalalu: మేషం, మీనం రాశుల వారికి అనుకోని అదృష్టం.. నేడు రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయంటే?

విద్యారంగంలోని వారు విజయం సాధిస్తారు. బంధువులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు లేకుంటే సంబంధాలు చెడిపోతాయి. మీరు చేసే పనులపై శ్రద్ధ వహించాలి.

Written By: Srinivas, Updated On : November 7, 2023 8:19 am

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 7న మంగళవారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, మీనం రాశులవారికి అదృష్టం, సింహం, ధనుస్సు వారికి ఆకస్మిక ధన లాభం జరగనుంది. మిగతా రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషరాశి:
పెట్టుబడులు పెట్టేవారికి లాభదాయకం. అనుకోకుండా వీరికి అదృష్టం వస్తుంది. దీంతో ఈరోజు మొత్తం ఉల్లాసంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం:
బంధువులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడితే ఇతరుల సలహాలు తీసుకోవాలి. సాయంత్రం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

మిథునం:
సమాజంలో గౌరవం లభిస్తుంది. అవసరానికి మాత్రమే ఖర్చు పెట్టండి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. విలువైన ఆస్తిని పొందుతారు. ప్రియమైన వారితో మంచిగా ఉండండి.

కర్కాటకం:
ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. పెద్దమొత్తంలో డబ్బు అందుతుంది.

సింహం:
సింహరాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉండే అవకాశం. ఊహించని వ్యక్తిని కలుస్తారు. పోటీ రంగాల్లో ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కన్య:
పెండింగు పనులను పూర్తి చేయాలి. లేకుంటే అవి దీర్ఘకాలికంగా కొనసాగుతాయి. భాగస్వామి పురోగతిపై ఆలోచిస్తారు. ఈరోజంతా ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు.

తుల:
విద్యారంగంలోని వారు విజయం సాధిస్తారు. బంధువులతో ఎక్కువగా వాదనలకు దిగొద్దు లేకుంటే సంబంధాలు చెడిపోతాయి. మీరు చేసే పనులపై శ్రద్ధ వహించాలి.

వృశ్చికం:
ఈరోజు వృశ్చిక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో వాగ్వాదం ఉండొచ్చు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఒకటికి, రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగొచ్చే అవకాశాలు తక్కవు.

ధనస్సు:
ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రోజంతా సంతోషంగా గడుపుతారు. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూల సమయం. ఉద్యోగులు ఇతరులతో వాదనలకు దిగకుండా జాగ్రత్తపడాలి.

మకరం:
సాయంత్ర ఉల్లాసమైన వాతావరణంలో గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ వేస్తారు. వ్యాపారాన్ని మార్చాలని అనుకునేవారికి ప్రయోజనం.

కుంభం:
ఆస్తులు అమ్మాలనుకునేవారు అన్నింటిని చెక్ చేసుకోవాలి. సోదరులతో వివాదాలుంటే పరిష్కరించుకోవాలి. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో గడుపుతారు.

మీనం:
వ్యాపారస్తులకు విదేశాల నుంచి కొంత సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు భారం తగ్గుతుంది. కొంచెం కష్టపడితే విజయం సాధిస్తారు. ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు.