
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు అంటే.. ఆ పోకడే వేరే లెవల్ లో ఉంటుంది. ఆ పవర్, స్టామినా, పరపతి అందరూ వాడేస్తుంటారు. కానీ ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలని ఆయన అనుకుంటారు. ఎప్పుడూ హద్దులు దాటరు.. తండ్రి స్థాపించిన పార్టీకి అధికారిక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కూడా తాను కంట్రోల్ ఉండి.. తన శ్రేణులను కంట్రోల్ గా నడిపిస్తారు. ఆయనే కల్వకుంట్ల తారక రాముడు..అలియాస్ మంత్రి కేటీఆర్. తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ
తెలంగాణకు భావి ముఖ్యమంత్రి అని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతుతున్నా ఆయన మాత్రం ఆ భింకాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు. అణుకువగా ఉంటారు. అనుకున్నది సాధించడంలో అందవేసిన చేయి..
తాజాగా కేటీఆర్ పుట్టినరోజు వేడుక రేపు అంటే జూలై 24ను పురస్కరించుకొని సందడి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ ను టీఆర్ఎస్ అభిమానులు విడుదల చేశారు. గాయని మధుప్రియ దీన్ని పాడారు.
తెలంగాణ ఉద్యమంలో తండ్రి చాటు బిడ్డగా కేటీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. మంత్రి హరీష్ రావు కంటే వెనుకే వచ్చాడు. మొదటగా సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీచేసి కేవలం 200లోపు మెజార్టీతో స్వల్ప తేడాతో గెలిచాడు. కానీ తనదైన నాయకత్వ లక్షణాలు, పట్టదుల, కృషి అభివృద్ధి చేసి ఇప్పుడు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తూ వస్తున్నారు. సిరిసిల్లను తన గెలుపునకు కంచుకోటగా మలుచుకున్నారు.
తెలంగాణ సాధించాక చిన్న వయసులోనే ఐటీ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహాన్ని తెచ్చారు. గడిచిన ఏడేళ్లలోనే ఎన్నో వేల కోట్ల పరిశ్రమలు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధిలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో కేటీఆర్ చెరగని ముద్ర వేశారు.
ఇక ప్రతీ బర్త్ డేకు కేటీఆర్ ఏదో ఒక సామాజక సేవ చేస్తారు. పోయిన బర్త్ డేకు తనే సొంతంగా 6 అంబులెన్స్ లను కొని ఆస్పత్రులకు విరాళం ఇచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తన బర్త్ డే సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్లు, టీవీల్లో ప్రచార యాడ్స్ ఇవ్వకుండా ఆ డబ్బులతో పేదలకు సేవ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు.. దానికి మంత్రి మల్లారెడ్డి సహా చాలా మంది పాటించి ఆస్పత్రులకు అంబులెన్స్ లు విరాళమిచ్చారు. ట్విట్టర్ లో ప్రతీ నిత్యం యాక్టివ్ ఉంటూ సాయం కోరిన వారికి ప్రతిరోజు తన టీం ద్వారా బాధితుల కష్టాలు తీరుస్తున్నాడు. ఇలా ఇప్పటివరకు ఎంతో మందికి సాయం చేశాడు.. ఇప్పటికీ ప్రతీరోజు చేస్తూనే ఉన్నాడు.
ఈసారి కూడా తన బర్త్ డే సందర్భంగా 100 త్రివీలర్ స్కూటర్లను వికలాంగులకు మంత్రి కేటీఆర్ రేపు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక టీఆర్ఎస్ మంత్రులు, నేతలు, అభిమానులను ఇలా ఉచితంగా త్రీవీలర్ స్కూటర్లు పంపిణీ చేయాలని వృథా ఖర్చు చేయవద్దని సూచించాడు.
ఇలా రాజకీయంగా.. సామాజికంగా.. అభివృద్ధి కోణంలో అన్నింట్లోనూ కేటీఆర్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా ‘oktelugu.com’ తరుఫున కూడా శుభాకాంక్షలు చెబుదాం..
