https://oktelugu.com/

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెడీ!

గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎలక్షన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రెడీ అయింది. ఈ మేరకు ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఎలక్షన్‌ కమిషనర్‌‌ పార్థసారథి దీనిపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. సంక్రాంతి పండుగలోపే పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్షన్‌ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. సర్కార్‌‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ నిన్నటి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 02:57 PM IST
    Follow us on

    గ్రేటర్‌‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎలక్షన్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రెడీ అయింది. ఈ మేరకు ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్‌ ప్రకటించింది. ఎలక్షన్‌ కమిషనర్‌‌ పార్థసారథి దీనిపై మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. సంక్రాంతి పండుగలోపే పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలక్షన్‌ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. సర్కార్‌‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    నిన్నటి నోటిఫికేషన్‌ ప్రకారం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం 2016 నాటి రిజర్వేషన్లు , వార్డుల విభజననే కొనసాగిస్తున్నట్లు పురపాలక శాఖ అధికారులు ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి తెలిపారు. నవంబర్‌ 7న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. నవంబర్‌ 9న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సమావేశం అవుతారు. ఓటర్ల జాబితాపై 11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక 13న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

    Also Read: బీజేపీ ని లెక్కలతో కొట్టిన కేటీఆర్!

    అయితే.. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10తో ముగియనుంది.గడువులోపే ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, కమిషనర్లు అరవింద్‌ కుమార్‌, లోకేశ్‌కుమార్‌లతో కూడా పార్థసారథి సమావేశమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై వారితో చర్చించారు. ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. పకడ్బందీగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎస్‌ఈసీ అధికారులను పార్థసారథి ఆదేశించారు.

    Also Read: బండి సంజయ్‌.. వీటికి సమాధానాలు చెప్పు: హరీష్ రావు

    జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో 2020 జనవరి నాటికి 73 లక్షల 56 వేల 980 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసినా.. డివిజన్‌ వైజ్‌ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవడానికి ఈసారి కూడా చాన్స్‌ ఇస్తారు. వారిని కలిపితే ఓటర్ల సంఖ్య 73 లక్షలు దాటుతుంది. కరోనా నేపథ్యంలో పదివేలకు పైగా పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది.