https://oktelugu.com/

కేటీఆర్ చిన్న సీఎం అయిపోయారా?

కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా టీకాల విషయంలో అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఫుల్ టైం కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గడానికి వ్యాక్సిన్, రెమిడెసివర్ ఇంజక్షన్లే మార్గమని కేటీఆర్ గుర్తించారు. వీటి విషయంలో గ్లోబల్ టెండర్ ఒక్కటే మార్గమని విశ్వసించారు. దీంతో వీటిని తెప్పించే విధంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రజల విశ్వాసం పొందేందుకు తాపత్రయ పడుతున్నారు. ఇంజక్షన్లపై ప్రత్యేక […]

Written By:
  • NARESH
  • , Updated On : May 15, 2021 / 02:29 PM IST
    Follow us on

    కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా టీకాల విషయంలో అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఫుల్ టైం కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ తగ్గడానికి వ్యాక్సిన్, రెమిడెసివర్ ఇంజక్షన్లే మార్గమని కేటీఆర్ గుర్తించారు. వీటి విషయంలో గ్లోబల్ టెండర్ ఒక్కటే మార్గమని విశ్వసించారు. దీంతో వీటిని తెప్పించే విధంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రజల విశ్వాసం పొందేందుకు తాపత్రయ పడుతున్నారు.

    ఇంజక్షన్లపై ప్రత్యేక దృష్టి
    కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు అవసరమని భావించారు. వాటిని తీసుకొచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. వారందరినీ ప్రగతిభవన్ కు పిలిపించి ఇంజక్షన్ల కొరత లేకండా చూడాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో కరోనా వైరస్ తమ ప్రభుత్వ బాధ్యత అని చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ రెండో సీఎంగా వ్యవహరిస్తున్నారు.

    వ్యాక్సిన్ల ఉత్పత్తికి సహకారాలు
    కరోనా వైరస్ ను తుదముట్టించే వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈమేరకు కేటీఆర్ పలు కంపెనీలకు ప్రమాణం చేశారు. ఏ విధమైన సహాయ సహకారాలు అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. దీంతో కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. ఇందులో భాగంగా కరోనా వైరస్ ను సమూలంగా తుదముట్టించేందుకు తమ శాయిశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నాయి. దీంతో ప్రభుత్వ చొరవతో కరోనా వైరస్ తగ్గే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

    రెండో ప్రాధాన్యత వ్యక్తిగా..
    తెలంగాణ రాష్ర్ట సమితి, ప్రభుత్వంలో కేటీఆర్ ప్రస్తుతం రెండో ప్రాధాన్యత వ్యక్తిగా చలామణి అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ఒకసారి సీఎం పీఠం అధిరోహించాలని భావించిన కేటీఆర్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా సీఎం కావాలన్నదే తన అభిమతంగా కనిపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పార్టీలో పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి క్రియాశీలపాత్ర పోషిస్తూ అందరితో కలివిడిగా ఉంటున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కేటీఆర్ సీఎం పీఠం అధిరోహించడం ఖాయమని పలువురు చెబుతున్నారు.